గీత గోవిందం సినిమాలో 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..' సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీడియో సాంగ్ రిలీజ్ అవ్వగానే చాలా స్పీడ్ గా 100 మిలియన్ వ్యూవ్స్ ని అందుకొని సౌత్ నెంబర్ వన్ సాంగ్ గా రికార్డు అందుకుంది. సిద్ శ్రీరామ్ ఆ సాంగ్ ను పాడిన సంగతి తెలిసిందే. 

విజయ్ దేవరకొండ హావభావాలు కూడా ఆ సాంగ్ లో అందరిని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో టాక్సీ వాలా సినిమా నుంచి వచ్చిన సాంగ్ 'మాట వినదుగా..' కూడా అందరిని ఆకట్టుకుంటోంది. ఇటీవల రిలీజైన ఈ లిరికల్ సాంగ్ 2 మిలియన్ వ్యూస్ ని అందుకొని సినిమాకు మంచి క్రేజ్ ను అందించింది. జెక్స్ జెబోయ్ సంగీతం అందించాడు. 

సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తోంది. గీత ఆర్ట్స్ 2- యువీ క్రియేషన్స్ సమర్పణలో వస్తోన్న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. రాహుల్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ గా నవంబర్ 16న రిలీజ్ కానుంది.