బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. 

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు దర్శకనిర్మాతలపై విరుచుకుపడ్డారు. అయితే రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా పోస్టర్ విడుదల చేసి ఓ అప్డేట్ ని ప్రకటించింది.

రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. 'షేడ్స్ ఆఫ్ సాహో' అంటూ ప్రభాస్ పాత్రకి సంబంధించిన సిరీస్ ని రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకి ఈ షేడ్స్ ని రివీల్ చేయనున్నారు.

సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

Scroll to load tweet…