మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంతలో రాంచరణ్ మరో క్రేజీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంతలో రాంచరణ్ మరో క్రేజీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ మూవీపై రాంచరణ్, బుచ్చిబాబు ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా ఉన్నాయి. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర మాండలీకంలో డైలాగులు చెప్పబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ లో తెరకెక్కే ఈ మూవీ కోసం నిర్మాతలు కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించారు. రంగస్థలం తర్వాత చరణ్ చిత్రాన్ని మరోసారి మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నేడు కొత్త ఆఫీస్ ప్రారంభం కోసం పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ పూజా కార్యక్రమాలకి నిర్మాతలు, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు సుకుమార్ అతిథిగా హాజరయ్యారు. అంతా సాంప్రదాయ బద్దంగా పసుపు వస్త్రాలు ధరించి పూజలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక పూర్తిస్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలని తెలియజేయనున్నారు.
