ఒకప్పుడు సినిమా టైటిల్స్ జానపదాలతో మేళవించి ఉండేవి. ఆ తర్వాత కుటుంబ అనుబంధాల ప్రధానంగా, ఆ తర్వాత పవర్ ఫుల్ టైటిల్స్ వచ్చాయి. పాటల పేర్లతో టైటిల్స్ వచ్చాయి. ఇప్పుడు టైటిల్స్ మరింత నవ్యతని సంతరించుకుంటున్నాయి.
సినిమాల్లో మార్పులు సహజమే. ప్రతి ఐదేళ్లకో, పదేళ్ళకో మార్పు జరుగుతుంది. మార్పు సినిమాల నుంచే ప్రారంభమవుతుందని చెప్పినా అతిశయోక్తి లేదు. సినిమాల్లో టైటిల్ విషయంలో ఈ మార్పు స్పష్టంగా చూడొచ్చు. ఒకప్పుడు సినిమా టైటిల్స్ జానపదాలతో మేళవించి ఉండేవి. ఆ తర్వాత కుటుంబ అనుబంధాల ప్రధానంగా, ఆ తర్వాత పవర్ ఫుల్ టైటిల్స్ వచ్చాయి. పాటల పేర్లతో టైటిల్స్ వచ్చాయి. ఇప్పుడు టైటిల్స్ మరింత నవ్యతని సంతరించుకుంటున్నాయి.
అందుకు నిదర్శనమే `నేడు విడుదల`. సినిమా అంటే గుర్తొచ్చే పేరు `నేడే విడుదల`. సినిమా విడుదలవుతుందని తెలిపేది నేడే విడుదల. తాజాగా అదే టైటిల్‌గా ఓ సినిమా రాబోతుంది. తెలుగులో రామ్ పన్నాల దర్శకుడిగా పరిచయం అవుతూ, ఐకా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై అసిఫ్ ఖాన్, మౌర్యాని దీన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఫ్రీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా యూనిట్ సభ్యులు ఒక వీడియో విడుదల చేసారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయని, అతి తొందర్లో సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ ని విడుదల చేస్తాం అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఆసక్తికరమైన కథతో, ఆలోచింపచేసే కథనంతో, ఆహ్లదపరిచే సంభాషణలతో, విన్నూతనమైన ప్రచారంతో రానుందని తెలిపారు. కాశి విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టి ఎన్ ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ లు నటించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 10, 2020, 11:49 PM IST