జీ తెలుగు లో ప్రసారం కానున్న 'నాగభైరవి' సీరియల్ తనదైన శైలిలో ప్రజల యొక్క హృదయాల్ని గెలుచుకుంది. ఈ సీరియల్ కి ప్రతేయక ఆకర్షణగా నిలిచింది నాగార్జున (పవన్) మరియు భైరవి (యాష్మి గౌడ) మధ్య నడుస్తున్న చిలిపి ప్రేమకథ. ఇప్పటి వరకు జరిగిన కథ విషయానికి వస్తే.. భైరవి తన చేతికి ఉన్న కంకణం కోల్పోవడం వల్ల ఆ కంకణం నాగార్జునను చేరుకుంటుంది. ఆ తర్వాత నాగార్జున తన స్వప్న సుందరి భైరవి అని తెలుసుకొని తనని, తన దానిగా చేసుకోవడానికి నాగవరంకి మళ్ళి వస్తాడు.

తెలుగు ప్రజలని మరింత మైమరిపించడానికి, జీ తెలుగు యొక్క పాపులర్ జోడి అయినా ప్రజ్వల్‌, అనూష.. శివుడు, పార్వతిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శృతి సింగంపల్లి మాంత్రికురాలిగా, కల్యాణ వైభోగమే సీరియల్ భావన సోదమ్మగా, `అత్తారింట్లో అక్క చెల్లలు` సీరియల్ ఫేమ్ మధు విశ్వంభర గా సీరియల్లో ప్రవేశం చేయనున్నారు. మరి ఇన్ని అతీంద్రియ శక్తుల మధ్య ఏ విధంగా నాగార్జున మరియు భైరవి నాగవరం లో ఉన్న గుడి రహస్యం గురించి తెలుసుకుంటారా?

పవన్, కల్కి రాజా వారి బ్యానర్ అయిన 27 పిక్చర్స్ ఆధ్వరంలో నిర్మిస్తున్న'నాగభైరవి' సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7: 30 గంటలకు జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డి లో ప్రసారం కానుంది. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకునే అవకాశం కల్పించింది. నెలకు కేవలం 20 రూపాయలకు  కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. 

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు 2005 మే 18న ప్రారంభమై దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.