మరోసారి నోరు జారిన అట్లీ, పగటికలలు కంటున్నావా అంటూ.. జవాన్ డైరెక్టర్ పై ట్రోలింగ్
మరోసారి నోరు జారి హాట్ టాపిక్ అయ్యాడు డైరెక్టర్ అట్లీ. ఆ మధ్య జవాన్ ను ఆస్కార్ కు తీసుకెళ్తానన్న అట్లీ.. ఈసారి తానే డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమా చేస్తానంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే..?

జవాన్ సినిమాతో బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ.. దాంతో అట్లీ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధించింది. ఈమూవీ తాజాగా 1000 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పఠాన్ తోవెయ్యి కోట్లు సాధించిన షారుఖ్.. జవాన్ తో మరోసారి ఆమార్క్ ను క్రాస్ చేసి.. అరుదైన రికార్డ్ సాధించాడు.
ఇక ఈసినిమా డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. ఈసినిమా ఇచ్చిన కిక్క్ తో ఏదేదో మాట్లాడుతున్నాడంటూ.. సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి.. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో జవాన్ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్తాను అన్న అట్లీ... ఆ విషయంలో ట్రోల్స్ ఫేస్ చేశారు. ఆ వ్యాఖ్యలు చేసి ఎన్నో రోజులు గడవక ముందే..మరోసారి మరికొన్ని కామెంట్స్ తో ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు దర్శకుడు.
తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ. ఈయన జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. షాకింగ్ విషయాలు కూడా వెల్లడించారు జవాన్ సినిమాను చూసి హాలీవుడ్ వారు ఎంతో ఆశ్చర్యపోయారని ఇలాంటి సినిమాని తాము చూడలేదని చెప్పకు వచ్చారని వెల్లడించారు. తనకు హాలీవుడ్ నుంచి అవకాశం కూడా వచ్చిందని అట్లీ అన్నారు.
నేను కనుక హాలీవుడ్ మేకర్స్ తో కలిసి మూవీస్ చేయాలి అనుకుంటే.. వెంటనే చెప్పాలని.. అక్కడ నుంచి ఆఫర్లు వస్తున్నాయన్నారు అట్లీ. ఈ విధంగా ఎన్నో ఫోన్ కాల్స్ తనకు చేశారని ఆయన వెల్లడించారు.ఇక తాను త్వరలోనే స్పానిష్ సినిమా కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అట్లీ తనకు హాలీవుడ్ సినిమా అవకాశాలు కల్పించారని ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అట్లీ చేసిన ఈ కామెంట్స్ తో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక రకంగా అట్లీపై భారీగా ట్రోల్ చేస్తున్నారు.అన్ని సినిమాలను మిక్స్ చేసే జవాన్ సినిమా చేసిన నీకు హాలీవుడ్ అవకాశాలు కల్పించారా ముందు ఊహల నుంచి బయటకురా అట్లీ అంటూ కొందరు కామెంట్ చేయగా, పగటి కలలు కనొద్దంటూ మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఇక కొంత మంది మాత్రం పాజిటీవ్ గా స్పందిస్తున్నారు.
ఈయన టాలెంటెడ్ డైరెక్టర్ తప్పకుండా ఈయనకు హాలీవుడ్ అవకాశాలు వస్తాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. అట్లీ డైరెక్టర్ చేసిన జవాన్ లో తమిళ స్టార్ హీరోయిన్ నయనతార బాద్ షాతో జత కట్టింది. విజయ్ సేతుపతి విలన్ గా.. నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సూపర్ సక్సెస్ తో పాటు.. 1000 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. పఠాన్ తర్వాత జవాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ సాధించడంతో షారుఖ్ దిల్ ఖుష్ అయ్యాడు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..