బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గానికి ప్రాతిననిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపి అనే సంగతి తెలిసిందే. ఈనెల 30తో ఆమె ఎంపీగా ప్రమాణం చేసి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. 'నేను ఎంపీగా గెలిచి ఏడేళ్లు పూర్తయ్యింది. మీ అభిమానంతో ముందుకు సాగుతున్నాను' అంటూ ఓ ట్వీట్ చేసారు. అంతే..ఆ ట్వీట్ కోసమే ఎదురుచుస్తున్నట్లాగా నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. క్రింద ట్రోల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిసింది.

'మీకు ఓటేసినందుకు సిగ్గు పడుతున్నాము. నిజానికి' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా చాలా మంది హేమమాలినికి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టారు. మీరు ఎంపీగా గెలిచి ఏడేళ్లు పూర్తయ్యింది. మీరు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వంతో లబ్ధి పొందుతున్నారు. మాకు ఉపయోగం ఏమిటి? అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 

నిజానికి ఈ ట్వీట్ చూసి తనకు నియోజకవర్గ ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపుతారని ఆమె ఆశించి ఉంటారు. కానీ ఈ ట్వీట్ మాత్రం ఆమెకు రివర్స్ అయ్యింది. అందుకు కారణం..ఆమె తన నియోజకవర్గాభివృద్దికి ఏమాత్రం పాటుపడకపోవటమే అంటన్నారు. దానికి తోడు ప్రస్తుతం కేంద్రం ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అయితే మధురలో 7 ఆక్సిజన్ యంత్రాలు అందించి హేమ మాలిని పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న మధుర జిల్లా బ్రజ్ వాసుల కోసం తాను ఏడు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నట్లు హేమమాలిని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల కరోనా రోగుల కోసం మరో 60 పడకలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.