తల్లి పోయి పది రోజులు కాలేదు.. నవ్వుతు ఫోజులా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

First Published 9, Mar 2018, 11:17 AM IST
Netizens trolled janhvi kapoor and sisters for celebrating birthday after sridevis death
Highlights
  • శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు
  • ఆమె చెల్లెలు ఖుషి, బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అంశుల, ఇంకా సోనమ్  కలిసి చిరునవ్వులు నవ్వుతూ ఫోటోలు దిగింది

మరణించిన తల్లి అంత్యక్రియలు జరిగి పది రోజులైనా కాలేదు. అప్పుడే గ్రాండ్ గా బర్త్ డే జరుపుకోవాలా ? పైగా నవ్వుతూ పోజులిస్తావా ? అంటూ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నెల 6 న జాన్వి తన 21 వ బర్త్ డేని జరుపుకొంది. ఆ సందర్భంగా ఆమె చెల్లెలు ఖుషి, బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అంశుల, ఇంకా సోనమ్ వంటి బంధువ్లులతో కలిసి చిరునవ్వులు నవ్వుతూ గ్రూప్ ఫోటోలు దిగింది. ఇవి వైరల్ అయ్యాయి. దీంతో నెట్ లో జాన్వి నిర్వాకంపై అనేకమంది తూర్పారబడుతున్నారు.


 

తల్లి చనిపోయిన బాధ నీలో కనిపించడం లేదు.పుట్టిన రోజు జరుపుకోవడానికి ఎందుకంత తొందర ? ఈ సెలబ్రేషన్స్ ని వాయిదా వేసుకోలేవా ? పైగా ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో ప్రముఖంగా పోస్ట్ చేస్తావా ? అంటూ అనేకమంది కసిగా కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 24 న శ్రీదేవి దుబాయ్ లోని హోటల్లో బాత్ టబ్ లో మునిగి మరణించగా..28 న అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఆమె అస్థికలను భర్త బోనీకపూర్ ఇటీవలే రామేశ్వరంలో..సముద్రంలో నిమజ్జనం చేశారు.

loader