బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ చిత్రాన్ని నిన్నటి వరకు నెటిజన్లు బైకాట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అమీర్ ఖాన్ స్పందించడంతో మళ్లీ మద్దతుగా నిలిచారు.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వరుస పరాజయాలను ముటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. `సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌`, `థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రాలు అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేకపోయాయి. గతంలో ‘దంగల్’తో ఇండియన్ సినిమా సత్తా చాటిన అమీర్ ఖాన్ ప్రస్తుతం కామెడీ డ్రామా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న అన్నీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అమీర్ ఖాన్ సినిమాను బైకాట్ చేస్తూ నెటిజన్లు నిన్నటి వరకు పెద్ద ఎత్తున వ్యతిరేకతను చూపారు. దీనిపై అమీర్ ఖాన్ స్పందించడంతో తాజాగా మళ్లీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.

గతంలో అమీర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను, కారీనా కపూర్ కామెంట్స్ ను ఎత్తిచూపుతూ నెటిజన్లు ‘లాల్ సింగ్ చడ్డా’ బైకాట్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. తాజాగా అమీర్ ఖాన్ దీనిపై స్పందిస్తూ.. ‘నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇదే నేను’ అంటూ చేసిన వ్యాఖ్యలతో అభిమానులు, నెటిజన్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. దీంతో #IndiawithLaalSinghChaddha హ్యాట్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. వ్యతిరేకత చూపిన నెటిజన్లే సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా `లాల్‌ సింగ్ చడ్డా`కు అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌ ఫిల్మ్ `ఫారెస్ట్ గంప్‌`కి రీమేక్‌ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆగస్ట్ రెండో వారంలో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలరాజు బోడి అనే సైనికుడిగా సరికొత్తగా కనిపించబోతున్నారు. తెలుగులో మెగా స్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. 

Scroll to load tweet…