సినిమా పోస్టర్స్ పై స్టార్ హీరో పేర్లను వేయడం కామన్. టు టైర్ హీరోల పేర్లు కూడా సినిమా పోస్టర్ లో టైటిల్ పై వేస్తారు. స్టార్ డైరెక్టర్స్ పేర్లు కూడా టైటిల్ పై వేయడం మనం చూడవచ్చు. ఐతే పోస్టర్ పై హీరోయిన్ పేరు ఎందుకు వేయరని ఆత్మిక డౌట్ వ్యక్తం చేశారు. 

అంటే పురుషాధిక్య సమాజంలో స్త్రీలను తోక్కేస్తున్నారు అనేలా ఆమె సందేహం ఉంది. తన సందేహాన్ని ఆత్మిక సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజెన్స్ నుండి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ఆత్మికను సమర్ధించగా, కొందరు సెటైర్స్ వేశారు. 

కొన్ని సినిమా పోస్టర్స్ పై హీరోయిన్ పేరు కూడా వేస్తారని సమాధానం చెప్పారు. అసురన్, మూకుతి అమ్మన్ పోస్టర్స్ పై హీరోయిన్ పేరు మీరు చూడవచ్చని చెప్పారు. ఇక ఆత్మిక ఎప్పిడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతుండగా ఆమెకు జూనియర్ సమంత అనే పేరుంది. ఆమెకు సమంతకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి.