కారణం ఏదైనా హీరో రామ్ పోతినేని పొలిటికల్ ఇష్యూలో తలదూర్చారు. ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదం గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ వేదికగా రామ్ ఏపి సీఎం జగన్ ని స్వర్ణ ప్యాలెస్ ఘటనలో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. దాని వలన మీపై మేము పెట్టుకున్న నమ్మకానికి, మీ రెప్యుటేషన్ కి భంగం కలుగుతుంది అన్నారు. అలాగే ఫైర్+ఫీజ్స్= ఫూల్స్ అని ఓ ఈక్వేషన్ పెట్టారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ హాస్పిటల్స్ అధినేత రమేష్ చౌదరి నిందుతుడిగా ఉండగా, ఆయన్ని కావాలని ఇరికిస్తున్నారని, అసలు విషయం కప్పిపుచ్చడానికి ఆయన్ని బలిచేస్తున్నారనట్లు ఆయన ట్వీట్స్ సారాంశం ఉంది.

దీనిపై నెటిజెన్స్  మండిపడుతున్నారు. ఆయన ట్వీట్ క్రింద కామెంట్స్ లో ఇస్మార్ట్ తెలివితేటలు మాదగ్గర చూపకు అంటున్నారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో రమేష్ చౌదరిది అసలు తప్పేమీ లేకపోతే అతను ఎందుకు పారిపోయాడని ప్రశ్నిస్తున్నారు. రమేష్ చౌదరి నిర్వహిస్తున్న కోవిద్ సెంటర్ లో ఉన్న 30 మంది రోగులలో 26 మందికి నెగెటివ్ అని రిజల్ట్ వస్తే, వారందరినీ అక్కడ ఎందుకు ఉంచారు, ఫీజులు వసూలు చేయడానికి కాదా అని ప్రశ్నిస్తున్నారు. రమేష్ చౌదరి రామ్ కి బంధువు కావడం వలన రామ్ ఆయన కోసం రంగంలోకి దిగారని ఆరోపణలు చేస్తున్నారు.

ఆ ట్వీట్ వెనుక రామ్ అంతరార్ధం ఏదైనా కానీ, అనవసరంగా రామ్ పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు అయ్యింది. అందుకే సినీతారలు పెద్దగా పొలిటికల్ విషయాలపై స్పందించరు. సోషల్ మీడియా ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లకపోతేనే బెటర్. ఇక రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీ చేస్తున్నారు. తమిళ హిట్ మూవీ తాడం కి రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.