ఓ మంచి మాట చెబితే కూడా ఈ రోజుల్లో విమర్శలు ఎదుర్కోవడం సహజమే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళండమ్మా అని చెప్పినా కూడా అమ్మా నా బూతులు తిట్టే ఈ సమాజంలో ఎవరు కరెక్టో చెప్పడం కూడా కష్టమే. అయితే రంగులు మార్చే సినిమా వరల్డ్ లో ఇటీవల కొత్త వివాదాలు ఎన్నో మీటూ తో ముడిపడిన సంగతి తెలిసిందే. 

మీటూ అనేది ఓ మంచి ఉద్యమమే. కానీ కొందరు దాన్ని పక్కదోవ పట్టిస్తూ వ్యక్తిగత విషయాల్ని, సంబంధం లేని విషయాల్ని కూడా అందులో కలిపేస్తున్నట్లు కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇటీవల గాన గంధర్వుడు SP బాల సుబ్రహ్మణ్యం హీరోయిన్స్ పై ఒక కామెంట్ చేశారు. సినీ వేడుకల్లో అమ్మాయిలు వేసుకొచ్చే డ్రెస్సులను చుస్తే వారి అమాయకత్వం అనుకోవాలో లేక అలాంటి డ్రెస్సులు వేసుకొస్తే అవకాశాలు ఇస్తారు అనుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. 

చాలా వరకు సాధారణ జనాలు చెప్పే మాటల్నే బాలు ఒక ఒక కార్యక్రమంలో అందరికి తెలిసేలా మాట్లాడారు. నేను ఇలా చెబుతున్నందుకు ఏ విధంగా భయపడటం లేదని బాలు అన్నారు. బహుశా రాద్దంతా చేస్తారని ఆయన ఆలోచనకు తట్టినట్లు ఉంది. అభిమానులు అయితే ఈ విషయంను మీటూ లో ఎక్కడ కలిపేస్తారో అని దయచేసి బాలు గారు చెప్పిన మాటల్ని ఒక్కసారి ఆలోచిస్తే మంచిదని మీటులో కలపకండమ్మా అని ముందే చెబుతున్నారు.