గంటకి నీ రేటు ఇదీ, గృహలక్ష్మి నటి కస్తూరిపై నెటిజన్ అసభ్యకర కామెంట్.. ఆమె రిప్లై ఏంటంటే..
నటి కస్తూరి శంకర్ పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో కస్తూరి శంకర్ తెలుగు తమిళ భాషల్లో హోమ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే, గ్లామర్ పాత్రల్లో కూడా నటించారు.
నటి కస్తూరి శంకర్ పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో కస్తూరి శంకర్ తెలుగు తమిళ భాషల్లో హోమ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే, గ్లామర్ పాత్రల్లో కూడా నటించారు. నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు.
ఆమె నటిస్తున్న గృహలక్ష్మి టీవీ సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. దీనితో ఆమె తెలుగువారందరికీ గృహాలక్ష్మిగా మారిపోయారు. దాదాపు ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి అందమైన ఇన్స్టా రీల్స్, హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.
అయితే తరచుగా కస్తూరి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బోల్డ్ గా ఎలాంటి అంశం గురించి అయినా తన అభిప్రాయం చెప్పడం కస్తూరి శైలి. నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందినప్పుడు కస్తూరి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నయనతారని తీవ్రంగా విమర్శించింది. ఇక అనసూయని నెటిజన్లు ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నప్పుడు కస్తూరి ఆమెకి మద్దతు తెలిపింది.
ఇక తాజాగా కస్తూరి తమిళ బిగ్ బాస్ సీజన్ 7పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే కమల్ హాసన్ హోస్ట్ గా సీజన్ 7 ప్రారంభం అయింది. ఈ షో పై కస్తూరి కామెంట్స్ చేస్తూ.. ఒక ఇంట్లో చాలా మందిని ఉంచి వాళ్ళ ఆర్టిఫీషియల్ ఫీలింగ్స్ చూసే ఆసక్తి నాకు లేదు. అలాంటి షోలని నేను పట్టించుకోను. నాకు అంత టైం లేదు, టివి కూడా లేదు. నాకు కుటుంబం, బాధ్యతలు, వర్క్ ఉన్నాయి. నేను బిగ్ బాస్ చూడడం లేదు అని కామెంట్స్ చేసింది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే గతంలో కస్తూరి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయినప్పటికీ ఆమె బిగ్ బాస్ షోని విమర్శిస్తోంది. ఆమె కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో నువ్వు డబ్బులు తీసుకుని బిగ్ బాస్ కి వెళ్ళావు కదా.. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటున్నారు. పలువురు నెటిజన్లు కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే హద్దులు దాటి కామెంట్స్ చేశాడు. అవునులే నీకు గంటకి రూ 5 వేలు వస్తాయి కదా అంటూ సభ్యంగా కామెంట్స్ చేశాడు. దీనితో కస్తూరి అతడిపై ఫైర్ అయింది. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.