పెద్ద సినిమాల హక్కుల కోసం ఓటిటి సంస్దల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. ఇది నిర్మాతలకు కలిసి వస్తోంది. ఇంతకీ ఏ ఓటిటికు ఎంత వ్యూయర్ షిప్ ఉంది...ఏ ఓటిటి సంస్ద టాప్ లో ఉందో చూద్దాం.
కరోనా తర్వాత ఓటిటి వేదికలకు గిరాకీ పెరిగిందనేది కాదనలేని సత్యం. కోవిద్ కారణంగా థియేటర్స్ మూసి వేయడం తో అందరు ఓటిటి మీద ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఊహించని విధంగా అప్పటి దాకా నామ మాత్రంగా ఉన్న ఓటిటి మార్కెట్ ఒక్కసారిగా భారీగా పెరిగి పోయింది. ధర్డ్ వేర్ కరోనా నేపథ్యంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో విడుదల అవుతుండగా మరికొన్ని సినిమాలు థియేటర్ లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్నాయి. ఇక పెద్ద సినిమాల హక్కుల కోసం ఓటిటి సంస్దల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. ఇది నిర్మాతలకు కలిసి వస్తోంది. ఇంతకీ ఏ ఓటిటికు ఎంత వ్యూయర్ షిప్ ఉంది...ఏ ఓటిటి సంస్ద టాప్ లో ఉందో చూద్దాం.
మన దేశంలో OTT సంస్కృతి అనేక రెట్లు పెరిగింది. ప్రముఖ OTT సంస్దలు సబ్‌స్క్రిప్షన్‌లను పెంచుకునేందుకు అన్నీ చేస్తున్నాయి. అయితే కొందరే దూసుకువెళ్తున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం, డిస్నీ హాట్‌స్టార్‌కు 49 మిలియన్ల మంది సభ్యులు మరియు అమెజాన్‌కు 19 మిలియన్లు ఉన్నారు. కానీ , Netflix కేవలం 5.5 మాత్రమే. మన దేశంలో ఈ ఓటిటికి ఉన్న ప్రజాదరణ బాగా తక్కువగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో ప్రారంభించబడిన రోజు నుండి, ఇది సబ్‌స్క్రిప్షన్‌ను పొందడం కంటే కంటెంట్‌పై మాత్రమే దృష్టి పెడుతూ వస్తోంది.
అయితే నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి తొందరపడని స్ట్రీమింగ్ దిగ్గజంగహా తనను తాను అభివర్ణించుకుంటోంది. చాలా పాపులర్ OTT గా పేరున్న
నెట్‌ఫ్లిక్స్ కేవలం క్లాస్ ఆడియన్స్‌ను మాత్రమే టార్గెట్ గా చేసుకుంటుంది. దాంతో మిడిల్ క్లాస్ నెట్‌ఫ్లిక్స్ తమకు అందుబాటులో లేదని భావిస్తోంది. మధ్యతరగతి వ్యక్తికి, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఖరీదైనది కూడా. మరోవైపు, క్రేజ్ ఉన్న భారీ సినిమాలతో అమెజాన్ భారీ ఎగ్రిమెంట్ చేసుకుంటోంది.
డిస్నీ హాట్‌స్టార్‌ని అయితే, సబ్‌స్క్రిప్షన్‌లపై కస్టమర్‌లకు మంచి ఆఫర్‌లను కూడా ఇస్తున్నారు. స్పోర్ట్స్ లైవ్ ఇస్తున్నందున వారి ప్రధాన ఆదాయం,సబ్‌స్క్రిప్షన్ అటు నుండి వస్తాయి. కాబట్టి, Netflix నెక్ట్స్ లెవిల్ కి వెళ్లాలంటే సబ్‌స్క్రిప్షన్ తగ్గించడం ద్వారా సాధారణ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా చేసుకోవాలి. అలాగే, అందరికీ నచ్చిన కంటెంట్‌ను ప్రసారం చేయాలి. కానీ ప్రపంచంలోనే నంబర్ వన్ OTT ప్లాట్‌ఫారమ్ అయినందున, నెట్‌ఫ్లిక్స్ దాని ఇక్కడ మార్కెట్ పై పెద్దగా దృష్టి పెడుతున్నట్లు లేదు.
