Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినిమాకు షాక్ ఇచ్చిన 'నెట్ ప్లిక్స్ '

 ఇవి మాత్రమే కాకుండా మరిన్ని పెద్ద ప్రాజెక్టుల పై దృష్టి పెట్టింది నెట్ ప్లిక్స్. దాంతో ఇప్పుడు టాలీవుడ్ బడా నిర్మాతలు ...నెట్ ప్లిక్స్ వైపు చూస్తున్నారు.

Netflix announces 16 films as part of its licensed Telugu content slate for 2023
Author
First Published Jan 15, 2023, 4:03 PM IST


ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న  ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇండియా లో మాత్రం అనుకున్న స్దాయిలో సక్సెస్ కాలేకపోతోంది.  మిగతా ఓటిటి సంస్థలతో పోటీ పడలేకపోతుంది. దాంతో రోజురోజుకు ఈ సంస్థ గ్రాఫ్ తగ్గిపోతుంది.   నెట్ ప్లిక్స్ సబ్ స్క్రైబర్స్ భారీగా తగ్గిపోతున్నారని చెప్తున్నారు. ఇదిలాగే కొనసాగితే మరింత మంది స్క్రైబర్స్ తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో నెట్ ప్లిక్స్ లోకల్ కంటెంట్ పై దృష్టి పెట్టింది.  ఇప్పటికే  ప‌లు హాలీవుడ్ సిరీస్‌లు, సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాన్నాయి.  వీటితో పాటు తెలుగులో 16 సినిమాలను నెట్ ప్లిక్స్ రైట్స్ తీసుకుంది. 2023 లో తెలుగులో  విడుద‌ల‌కానున్న సినిమాలు ఏవంటే...
 
భోళా శంకర్
అమిగోస్
మీటర్
బడ్డీ
బుట్ట బొమ్మ
PVT 04
తిల్లు స్వ్కేర్
దసరా
థమాకా
కార్తికేయ 3
18 పేజీస్
VT 12
విరూపాక్ష
SSMB 28

ఇన్ని సినిమాల రైట్స్ నెట్ ప్లిక్స్  ఒకేసారి తీసుకోవటంతో టాలీవుడ్ షాక్ అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా మరిన్ని పెద్ద ప్రాజెక్టుల పై దృష్టి పెట్టింది నెట్ ప్లిక్స్. దాంతో ఇప్పుడు టాలీవుడ్ బడా నిర్మాతలు ...నెట్ ప్లిక్స్ వైపు చూస్తున్నారు. భారీ డీల్ తో తమ సినిమాలు లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాల్లో హైలెట్ గా మాట్లాడుకుంటున్నది, భారీ డీల్ అయ్యినది మాత్రం మహేష్ 28 వ చిత్రం. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత హీరో మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక‌ముందే ఓటీటీ డీల్ ముగిసింది. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ తాము కొనుగోలు చేసిన‌ట్లు నెట్‌ఫ్లిక్స్ శ‌నివారం ప్ర‌క‌టించింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను తామే తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు పూర్త‌యింది.

Follow Us:
Download App:
  • android
  • ios