హైదరాబాద్ లో ACT, Netflix ఆధ్వర్యంలో ‘రానా నాయుడు’ ప్రీమియర్.. కానీ!

ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ యాక్ట్ ఫైబర్ నెట్ (ACT Fibernet) యూజర్లకు ఉచితంగా ‘రానా నాయుడు’ ప్రీమియర్ షోను హైదరాబాద్ లో ప్రదర్శించబోతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
 

Netflix and ACT all set to premier Rana Naidu Web Series in Hyderabad

మొట్టమొదటిసారిగా విక్టరీ వెంకటేశ్ (venkatesh) మరియు రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రానా నాయుడు’ మూడు రోజుల్లో ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే సిరీస్ కు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ భారీ హైప్ ను పెంచేసింది. అయితే ఈ సిరీస్ ను హైదరాబాద్ లో ఉచితంగా ప్రీమియర్ వేయనున్నారు. 

అయితే,  అది కేవలం యాక్ట్ ఫైబర్ నెట్ (Act Fibernet) మరియు నెట్ ఫ్లిక్స్ యూజర్లకు మాత్రమే. కొత్త నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ACT ఫైబర్‌నెట్ కస్టమర్‌లకు మాత్రమే ఈ అవకాశం కలదగని పేర్కొన్నారు. తమ వినియోగదారులకు ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ సంతోషంగా ఉందని తెలిపింది. భారతదేశంలోని అతిపెద్ద ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ISPలలో (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్) ఒకటైన ACT ఫైబర్ నెట్ మరియు Netflix ఆధ్వర్యంలో రాబోయే క్రైమ్-డ్రామా సిరీస్ Rana Naidu ప్రీమియర్‌ను హైదరాబాద్ లో ప్రదర్శించనున్నారు. 

2023 మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే హైదరాబాద్, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నంలోని థియేటర్‌లలో 9 మార్చి 2023న ప్రీమియర్‌కు ఉచిత టిక్కెట్‌ను గెలుచుకునే అవకాశం కలదన్నారు.  నెట్ ఫ్లిక్స్ తో కలిసి ‘రానా నాయుడు’ ప్రత్యేక ప్రీమియర్ ను అందించడం మాకు ఆనందంగా ఉందని మార్కెటింగ్ హెడ్ రవి కార్తీక్ తెలిపారు. మరోవైపు రానా, వెంకటేశ్ అభిమానులూ ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios