Aha : మహిళా వ్యాపారవేత్తల కోసం ‘నేను సూపర్ ఉమెన్’ రియాలిటీ షో.. దరఖాస్తులు స్వీకరిస్తున్న ‘ఆహా’!
సక్సెస్ ఫుల్ షోలతో దూసుకుపోతున్న ‘ఆహా’.. మరో సరికొత్త ప్రయోగం చేయబోతోంది. సరికొత్తగా మహిళా వ్యాపారవేత్తలకు ‘ఆహా’లో అవకాశం కలిపిస్తూ ‘నేను సూపర్ ఉమెన్’ బిజినెస్ రియాలిటీ షోను తీసుకురాబోతోంది.
ప్రేక్షకులు మెచ్చే సినిమాలతో పాటు.. దుమ్ములేపే రియాలిటీ షోలను అందిస్తోంది ‘ఆహా’(Aha). ప్రస్తుతం మహిళా వ్యాపారవేత్తలకు తమ తమ ఆలోచనలు పంచుకునేందుకు, తమ ప్రయాణం గురించి వివరించేందుకు సరైన వేదికను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఏర్పాటు చేస్తుండటం విశేషం. మొదటి సారిగా మహిళా వ్యాపారవేత్తల కోసం 'నేను సూపర్ ఉమెన్' (Nenu Super Women) అనే రియాల్టీ షోను ఆహా టీం ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాల్టీ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉండబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ప్రోత్సాహ౦ అందిచండం మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని టీం అభిప్రాయపడింది. కానీ సామాజిక-ఆర్థిక కారణాలతో మహిళలు తరచుగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆహా తీసుకువస్తున్న 'నేను సూపర్ ఉమెన్' షో మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేకమన్నారు. మీ దగ్గరి మెరుగైన వ్యాపార ఆలోచనలను, వ్యాపార ప్రొటోటైప్ లేదా బిజినెస్ చేస్తున్న వాటిని వారు పరిశీలిస్తారని తెలిపారు. అయితే, ఈ షోలో పాల్గొనాలనుకునే వారికి అవకాశం కల్పించనుంది. ఈ మేరకు దరఖాస్తులను కూడా ఆహా టీం స్వీకరిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని వీ హబ్, గ్రూప్ ఎం, ఆహా కలిసి నిర్వహిస్తోంది.
ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. దరఖాస్తు చేసుకునేందుకు.. https://tally.so/r/wvXg4D లింక్‌ను ఓపెన్ చేయాలి. నిబంధనలు పాటిస్తూ అందులోని ఫాంను నింపాలి. మీ వద్ద ఉన్న బిజినెస్ ఐడియాలను రాయడంతో పాటు ఎందుకు అంత ప్రత్యేకం, పెట్టుబడులు పెట్టేంత విషయం ఏముందో కూడా వివరించాలి. ఓ నిమిషం నిడివి గల వీడియోను కూడా పంపండి. రెండో దశలో అభ్యర్థులను వర్చువల్‌గా ట్రైన్ చేస్తారు. ‘నేను సూపర్ ఉమెన్’ టీం మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది. ఎకనామిక్స్, ఆపరేషన్స్, ఫైనాన్స్, స్ట్రాటజీల వంటి విషయంలో టీం సలహాలు, సూచనలు ఇస్తుంది. మూడో దశలో ఎంపికైన అభ్యర్థులు మెంటర్స్‌ను కలిసి మాట్లాడాల్సి ఉంటుంది. వారి వారి వ్యాపార ఆలోచనలు, కొత్త ఐడియాలను వ్యక్తపరచాలి. నాల్గో దశలో నలభై మంది అభ్యర్థులను ఎంచుకుంటారు... వారంతా కూడా ఇన్వెస్టర్లతో తమ తమ ఆలోచనలు, కొత్త ఐడియాలను పంచుకుంటారు.
అయితే, వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలను 'ఏంజెల్స్' గా అందరి ముందుకు తీసుకొని వస్తున్నారు. డార్విన్ బాక్స్ కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని ఈ షోలో కనిపించనున్నారు. ఆయన ఐఐఎం లక్నో నుంచి వచ్చి డార్విన్ బాక్స్ కో ఫౌండర్‌గా ఎదిగారు. అంతేకాకుండా సాస్‌భూమిని కూడా డెవలప్ చేశారు. సరికొత్త ఆలోచనలతో రాబోయే వారిని ప్రోత్సహించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సైతం సిద్దంగా ఉన్నారు. అలాగే ముద్ర వెంచర్స్ స్థాపకురాలు స్వాతి రెడ్డి గునుపాటి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. ఆమె ముద్ర వెంచర్స్‌లో భాగంగా డిఫెన్స్, ఆరోగ్యం, ఆహారం, వినోద రంగంలో రకరకాల పెట్టుబడులు పెడుతూ సక్సెస్‌ఫుల్ అవుతున్నారు.
ప్రముఖ వ్యాపారవేత శ్రీధర్ గది 2015లో క్వాంటేలా ఇంక్ అనే సంస్థను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ సంస్థను టాప్ ప్లేస్‌లోకి తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్‌లో భాగంగా మార్కెట్ లీడర్లలో సింపుల్ డ్యాష్ బోర్డ్ కంపెనీగా క్వాంటెలా ఇంక్ నిలిచింది. అలాగే సిల్వర్ నీడిల్ వెంచర్స్ యొక్క వెంచర్ పార్టనర్ రేణుక బొడ్ల ఐఐఎం కలకత్తా నుంచి పట్టభద్రురాలయ్యారు. ఈమె కూడా షోలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నోవార్టిస్ బియోమ్ ఇండియాకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒరాకిల్, సిస్కో, జీఈ, నోవార్టిస్ వంటి వాటిలో ఇరవైఏళ్లుగా స్టింట్‌గా పని చేసిన తరువాత సిల్వర్ నీడిల్ వెంచర్స్‌లో జాయిన్ అయ్యారు. అభి బస్ ఫౌండర్ అండ్ సీఈఓ సుధాకర్ రెడ్డి ఓ సంచలనం సృష్టించారు. బస్ టికెట్ యాప్స్‌లో అభి బస్ ఎంతటి వృద్దిని సాధిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ పదమూడేళ్లలో దాదాపు 200 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం జరిగింది. అభి బస్ అనేది దాదాపు 3500 ప్రైవేట్, పబ్లిక్ రవాణా సంస్థలతో కలిసి పని చేస్తోంది. నెలకు ఇంచు మించుగా రెండు మిలియన్ల సీట్లు బుక్ అవుతాయి. ఆయన ఈ సంస్థను లెక్సిగో గ్రూపులో విలీనం చేశారు. ఆ తరువాత ఫ్రెష్ బస్ అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. మద్రాసులోని అన్నా యూనివర్సిటీలో సుధాకర్ రెడ్డి చదువుకున్నారు. మీరు కూడా మీ వ్యాపార ఆలోచనలను పంచుకునేందుకు ఈ రియాల్టీ షోలో పాల్గొనాలని అనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.