హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నేను లేను'. దివ్యాషిక క్రియేష‌న్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుక్రి  నిర్మిస్తున్నారు. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌.. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకుడు.

ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు 'యుఏ'; సర్టిఫికెట్ అందించారు. జులై 12 ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లాగే సినిమా కూడా అందరిని ఆకట్టుకుంటుంది అని దర్శకుడు రామ్ కుమార్ తెలిపారు. 

నిర్మాత  సుక్రి మాట్లాడుతూ ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో  వస్తున్న సినిమా ఇది. అందరిని తప్పకుండా అలరిస్తుంది అని అన్నారు. ఆశ్రీత్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.