కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న నేనే రాజు నేనే మంత్రి తొలి వారం 18.6 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న నేనే రాజు నేనే మంత్రి 19 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు టాక్, ఇక వచ్చేది లాభాలే
తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్నాయి. వారంతతపు సెలవు, స్వాతంత్ర దినోత్సవం ఇలా వరుస సెలవులతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. రానా కెరీర్ లో సోలో హీరోగా ఓపెనింగ్స్ అత్యధికంగా సాధించిన మూవీగా నేనేరాజు నేనేమంత్రి నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి తొలి వారం ఏరియా వారీ వసూళ్ల వివరాలు ఇలా వున్నాయి.
నైజాం | 6.28 కోట్లు |
| సీడెడ్ | 2.15 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 2.18 కోట్లు |
| ఈస్ట్ | 1.38 కోట్లు |
| వెస్ట్ | 70 లక్షలు |
| కృష్ణా | 1.15 కోట్లు |
| గుంటూరు | 1.16 కోట్లు |
| నెల్లూరు | 43 లక్షలు |
| ఎపి+నైజాం | 15.5 కోట్లు |
| కర్ణాటక | 1.1కోట్లు |
| యు.ఎస్.ఎ | 1.4కోట్లు |
| ఇతర | 60 లక్షలు |
| వరల్డ్ వైడ్ టోటల్ | 18.6 కోట్లు |
