తమిళ స్టార్ డైరెక్టర్ కు.. బాలీవుడ్ సీనియార్  స్టార్ హీరో.. డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఏదో కాస్ట్లీ కార్.. కాస్ట్లీ వాచ్ లాంటిది అనుకునేరు. అంతకు మించిన బహుబమతి అందించాడు బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్. 

చాలా మంది స్టార్ హీరోలు తమతో సినిమాచేస్తున్న దర్శకుల మీద ఇంప్రెస్ అయినా.. హిట్ ఇచ్చినా. ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం కామన్ గా జరుగుతుంటుంది. ఈమధ్య కాలంలో అలాంటివి చాలా చూశాం. అయితే హీరోలు తమ రేంజ్ కు తగ్గట్టుగా.. రెండు మూడు కోట్ల కార్లు.. ఖరీదైనర వాచ్ లు గిఫ్ట్ లుగా ఇస్తుంటారు. కాని తమిళ యంగ్ డైరెక్టర్ కు బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. స్కూటర్. ఆశ్చర్యంగా ఉంది కదా కాని నిజం. ఇంతకీ స్కూటర్ ఎందుకిచ్చాడంటే..? 

తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బాలీవుడ్ సీనియర్ స్టార్.. జాకీ ష్రాఫ్... నుంచి అరుదైన బహుమతి అందుకున్నాడు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌ యెల్లో వెస్పా స్కూటర్‌ను డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌ కుమార్‌కు బహుమతిగా అందించాడు. ఎంతో విలువైన కానుక అందుకున్న విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీ ద్వారా షేర్ చేశాడు నెల్సన్‌ దిలీప్ కుమార్‌. అయితే నెల్సన్‌కు జాకీ ష్రాఫ్‌ స్కూటీ గిఫ్ట్‌గా అందించడం వెనకున్న స్పెషల్ ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం నెల్సన్ దిలీప్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రజనీకాంత్ తో పాటు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌, బాలీవుడ్ స్టార్ సీనియర్ యాక్టర్ జాకీష్రాఫ్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్‌లో తమన్నా భాటియా, సునీల్‌, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక ఇప్పటికే జైలర్ నుంచి రిలీజ్ అయిన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌.. తెలుగు స్టార్ సునీల్.. తమన్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది విజయ్‌ హీరోగా బీస్ట్‌ సినిమా తెరకెక్కించాడు నెల్సన్ దిలీప్ కుమార్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌ డ్‌ టాక్‌ తెచ్చుకుంది.