రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేశ్ విలన్ గా చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో  యాక్షన్ థ్రిల్లర్‌గా నిర్మితమవుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదే స్దాయిలో  భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే టీజర్ ట్రైలర్లు.. పాటలు రిలీజ్ చేసి క్రేజ్ క్రియేట్ చేస్తున్న 'సాహో' టీమ్ తాజాగా 'సాహో' లో నటించే   క్యారెక్టర్స్  పోస్టర్లు విడుదల చేయడం ప్రారంభించింది.   

అందులో భాగంగా మొదటి క్యారెక్టర్ పోస్టర్ అంటూ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ పోస్టర్ ను విడుదల చేశారు.   ఈ పోస్టర్ లో నీల్ నితిన్ ఒక లేత గోధుమ రంగు జాకెట్ ధరించి... కళ్ళకు  గాగుల్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు. . ‘ది ఎండ్ డసన్ట్ ఆన్సర్ ఎవ్రిథింగ్’ అనే క్యాప్షన్ తో రిలీజైన ఈ పోస్టర్ సినిమా ఎంత స్టైలిష్ గా ఉండబోతోందో సూచిస్తోంది .  జై గా ఈ సినిమాలో నీల్ కనిపించనున్నారు. మీరు ఇక్కడ ఆ ఫొటోను చూడవచ్చు. 

తెలుగు‌తో పాటు హిందీ, తమిళం, మలయాళంలో  విడుదలవుతోన్న ఈ సినిమాలో  బాలీవుడ్‌కు చెందిన జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, చంకీ పాండేతో పాటు తమిళ నటుడు అరున్ విజయ్, మలయాళ నటుడు లాల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సుప్రీత్ ప్రధాన తారాగణంగా ఉన్నారు.  

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. హిందీలో టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ‘సాహో’ను విడుదల చేస్తున్నారు. ‘రన్ రాజా రన్’తో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ రచన, దర్శకత్వం అందిస్తున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 30న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.