సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మరణానికి ఇండస్ట్రీలోని రాజకీయాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో స్టార్ వారసులపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో స్టార్ వారసులకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సుశాంత్ అభిమానులతో పాటు నెపోటిజంను వ్యతిరేకించేవారు స్టార్ వారసులను సోషల్ మీడియాలో అన్‌ ఫాలో చేస్తున్నారు.

స్టార్ వారసులకు కూడా ఈ విమర్శలు తలనొప్పిగా మారాయి. దీంతో పలువరు తారలు సోషల్ మీడియా నుంచి వైదులుగుతున్నారు. ఇప్పటికే సోనమ్‌ కపూర్‌ తన ట్విటర్‌ పేజ్‌లో కామెంట్స్‌ను డిజెబుల్ చేసింది. 64 ఏళ్ల వయసులో తన తల్లి దండ్రులను ఇతర కుటుంబ సభ్యులకు ఎవరో విమర్శించటం భరించకలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తనపై విమర్శలు చేసిన కొన్ని స్క్రీన్‌ షాట్స్‌ను కూడా షేర్ చేసింది సోనమ్.

సోనమ్ బాటలోనే  మరో స్టార్ వారసురాలు సోనాక్షి కూడా తీవ్ర నిర్ణయం తీసుకుంది. సోనమ్ కేవలం కామెంట్స్‌ను బ్లాక్ చేస్తే.. సోనమ్ ఏకంగా ట్విటర్‌ అకౌంట్‌నే డియాక్టివేట్ చేసింది. నన్ను తిట్టాలనుకునేవారికి ఇక అలాంటి అవకాశం ఇవ్వను అంటూ ట్వీటర్ నుంచి వైదొలిగింది సోనాక్షి. తాజాగా అదే బాటలో మరికొందరు నడుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కూడా సోషల్‌ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ద్వేశం, బంధుప్రీతి, లాంటి వాటి వల్ల నా పై వస్తున్న విమర్శలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది.
Bollywood News In Hindi : After Sonakshi, Saqib and Aayush, Neha ...

`నేను తిరిగి నిద్రలోకి వెలుతున్న.. ప్రపంచంలో తిరిగి స్వేచ్చ, ప్రేమ, గౌరవం, రక్షణ వచ్చిన తరువాత నిద్ర లేపండి. వారసత్వం, జెలసీ, బాసీజమ్‌, హిట్లర్స్‌, మర్డరర్స్‌, సూసైడ్స్‌, చెడ్డ వ్యక్తులు లేనప్పుడు. భయపడకండి నేను చచ్చిపోవటం లేదు. కొద్ది రోజులు దూరంగా వెళుతున్నా అంతే` అంటూ చివరి ట్వీట్ చేసిన నేహ తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డియాక్టివేట్ చేసింది.