హీరోకి లిప్ లాక్ ఇచ్చి అడ్డంగా బుక్కైంది!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Aug 2018, 1:00 PM IST
Negative Troll on Rashmika Mandanna
Highlights

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది రష్మిక. హీరోపై కూర్చొని మరి ఆమె పెట్టిన లిప్ లాక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక ఈ రేంజ్ లో రొమాన్స్ చేసిందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు

కన్నడ 'కిరాక్ పార్టీ' సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది రష్మిక మందన. ఆ తరువాత తెలుగులో నాగశౌర్య సరసన 'ఛలో' సినిమాలో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ నటిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె నటించిన 'గీత గోవిందం' సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి.

ఇందులో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది రష్మిక. హీరోపై కూర్చొని మరి ఆమె పెట్టిన లిప్ లాక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక ఈ రేంజ్ లో రొమాన్స్ చేసిందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కన్నడ ప్రేక్షకులు మాత్రం ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం రోహిత్ శెట్టితో ఆమెకు నిశ్చితార్ధం జరగడమే.. నిజానికి ఈ సినిమా పోస్టర్లు రిలీజైన సమయంలోనే రష్మికపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ సీన్స్ లో నటించిందని తెలిసిన తరువాత ఆమెపై నెగెటివ్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొత్తానికి ఓ తెలుగు సినిమా కారణంగా కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది రష్మిక. అదే విజయ్ దేవరకొండతో ఆమె 'డియర్ కామ్రేడ్' అనే మరో సినిమాలో నటించడానికి కూడా సై అంది రష్మిక.   


ఇది కూడా చదవండి.. 

'గీతగోవిందం'లో హద్దులు చెరిపేసే లిప్ లాక్ సీన్లు!

 

loader