బాలీవుడ్ తరాల మోజు ఎప్పుడూ కొత్త బంగ్లాలు, కొత్త కార్లపైనే ఉంటుంది. బాలీవుడ్ తారలు తరచుగా ఖరీదైన ఫ్లాట్ లో కొంటూనే ఉంటారు. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరో తల్లి రీసెంట్ గా కొనుగోలు చేసిన ఫ్లాట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
బాలీవుడ్ తరాల మోజు ఎప్పుడూ కొత్త బంగ్లాలు, కొత్త కార్లపైనే ఉంటుంది. బాలీవుడ్ తారలు తరచుగా ఖరీదైన ఫ్లాట్ లో కొంటూనే ఉంటారు. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరో తల్లి రీసెంట్ గా కొనుగోలు చేసిన ఫ్లాట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ వయసులో ఆమె అంత ఖరీదైన ఫ్లాట్ ఎందుకు కొన్నట్లు.. ఎవరికోసం అన్నట్లుగా బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె ఎవరో కాదు రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్. బాంద్రా లోని కుర్లా కాంప్లెక్స్ లో నీతూ కపూర్ విలాసవంతమైన 4 బీహెచ్ కె ఫ్లాట్ ని ఏకంగా 17 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి.
కేవలం రిజిస్ట్రేషన్ కోసం ఆమె 1.04 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నీతూ కపూర్ పాలి హిల్ లో ఒక బంగ్లాలో నివసిస్తున్నారు. నీతూ కపూర్ కూడా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. సూరజ్ చిత్రంతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనేక చిత్రాల్లో మెరిశారు. 1980లో ఆమె రిషి కపూర్ ని వివాహం చేసుకున్నారు.
వీరికి రిద్ధిమా, రణబీర్ కపూర్ లు సంతానం. రణబీర్ కపూర్ గత ఏడాది అలియా భట్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప కూడా జన్మించింది. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం రణబీర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు.
