Asianet News Telugu

రాత్రికి ఇక్కడ పడుకో..హోటల్ రూమ్ లో నిర్మాత,ఆమె ఏం చేసిందంటే

సౌత్ ఇండియన్ సినిమాల్లో పేరున్న నిర్మాత. తన కొత్త సినిమాల్లో అవకాశం ఇస్తానని పిలిచారు. ముంబైలోనే ఒక ఫేమస్ హోటల్ లో దిగారు. నేను హోటల్ లాబీకి వెళ్లి ఫోన్ చేశాను. కానీ ఆయన తన రూమ్ కి రమ్మని చెప్పారు. జంకుతూనే వెళ్ళాను. 

Neena Guptha talks about Castin couch with South Producer Jsp
Author
Hyderabad, First Published Jun 17, 2021, 3:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


కొద్ది కాలంగా కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కీలక వ్యాఖ్యలు చేసారు. కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ సినీ జనం నిర్భయంగా బయటకు వచ్చి నిజానిజాలని బయట పెడుతున్నారు.  తాజాగా తాను ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన పడ్డానని చెప్పింది నీనా గుప్తా.  

 నీనా గుప్తా... హిందీ సినిమాలు, సీరియల్స్‌ చూసేవారికి సుపరిచితమైన పేరు. ఈ సీనియర్‌ నటీమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలతోనే కాదు తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచారీ సీనియర్‌ యాక్ట్రెస్‌. సినిమాల్లో ఉండగానే వివియన్‌ రిచర్డ్స్‌తో ప్రేమలో పడడం..గర్భం ధరించడం...రిచర్డ్స్‌తో విడిపోవడం.. మసాబా జననం...వివేక్‌ మెహ్రాతో రెండో పెళ్లి...   ఇలా సినిమాలకు మించిన మలుపులు ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్నాయి.

ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ స్టేజికి చేరుకోవడంతో ఆమె తన ఆత్మకథని విడుదల చేశారు. ప్రస్తుతం విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్‌లో ఉన్న ఆమె తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా ‘నిజం చెప్పాలంటే..’ అనే పేరుతో ఓ వీడియోని షేర్ చేశారు. అందులో ఆమె తన గత జీవిత అనుభవాలతో పాటు, తన ప్రేమకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకొన్నారు. “సచ్ కహూ తో” (నిజంగా చెప్పాలంటే) అంటూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలు రాసుకున్నారు. అందులో ఒక దక్షిణాది నిర్మాతతో ఒక రాత్రి హోటల్లో జరిగిన సంఘటనని చెప్పుకొచ్చారు.

“సౌత్ ఇండియన్ సినిమాల్లో పేరున్న నిర్మాత. తన కొత్త సినిమాల్లో అవకాశం ఇస్తానని పిలిచారు. ముంబైలోనే ఒక ఫేమస్ హోటల్ లో దిగారు. నేను హోటల్ లాబీకి వెళ్లి ఫోన్ చేశాను. కానీ ఆయన తన రూమ్ కి రమ్మని చెప్పారు. జంకుతూనే వెళ్ళాను. ఎంతమంది బాలీవుడ్ హీరోయిన్లను తాను పరిచయం చేసిందో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనకి ఒక హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర ఇద్దామని అనుకుంటున్నాను అన్నారు. చిన్న పాత్రలు చేయదలుచుకోలేదు అని చెప్పి బయలుదేరబోతుండగా… అదేంటి రాత్రికి ఇక్కడ పడుకోవా అని అడిగారు… మైండ్ బ్లాంక్ అయింది. కోపంతో బయటికి వచ్చేశాను,” అని రాసుకొంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో? అనేది హాట్ టాపిక్ గా మారింది. 

‘గాంధీ’ వంటి అంతర్జాతీయ సినిమాల్లోనూ నటించటమే కాకుండా... 1980లలో ఆర్ట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకున్న నీనా గుప్తా ఆ తర్వాత బాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ ఎక్కువ ప్రజాదరణ పొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios