బాలీవుడ్‌ నటి నేహా దూపియా చేస్తున్న టాక్‌ షో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ షోలో పాల్గోన్న సినీ తారలు సంచలన వ్యాఖ్యలతో షోకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. నో ఫిల్టర్‌ నేహా అనే టైటిల్‌కు తగ్గట్టుగానే ఏ మాత్రం ఫిల్డర్ లేకుండా షోలు మాట్లాడుతున్నారు గెస్ట్‌లు. తాజాగా ఈ షోలో పాల్గొన్న సీనియర్ నటి టెలివిజన్ దర్శకురాలు నీనా గుప్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్‌ అయ్యింది.

షోలో భాగంగా నేహా, నీనాను మీరు యంగ్‌ ఏజ్‌లో ఉంటే మీకు మీరు ఏం సలహా ఇచ్చుకుంటారు అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన నీనా `పని మీద దృష్టి పెట్టు, మగాళ్ల మీద కాదు` అని సమాధానం ఇచ్చింది. నీనా గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చాలా సార్లు చేసింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను, వాటి నుంచి ఆమె నేర్చుకున్న గుణపాఠాలను ఆమె తరుచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

నేహా దూపియా హోస్ట్ చేస్తున్న నో ఫిల్డర్‌ విత్‌ నేహా కార్యక్రమం ఐదో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రోమోలో నీనా గుప్తా, రానా, కపిల్ దేవ్‌, రాహుల్ ద్రవిడ్, సైఫ్ అలీఖాన్, సోనూ సూద్‌, అదితి రావ్‌ హైదరీలు కనిపించారు. ఈ షో ఈ నెల 28న ప్రారంభ కానుంది.