Asianet News TeluguAsianet News Telugu

#NBK107: తండ్రిని పిలిచే పిలుపుతో బాలయ్య టైటిల్

 ఆ టైటిల్ అయితే జనాల్లోకి బాగా వెళ్తుందని భావించి ఫైనల్ చేసారని తెలుస్తోంది. అక్టోబర్ 21 న టైటిల్‌‌ని అనౌన్స్‌‌ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్‌‌ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.  

NBK107 movie titled as Anna Garu?
Author
First Published Oct 19, 2022, 5:27 PM IST


బాలయ్య వంటి స్టార్ హీరో సినిమాకు టైటిల్ పెట్టడం ఛాలెంజే. అందుకే రకరకాలుగా ఆలోచించి టైటిల్ ఫిక్స్ చేస్తారు. ఆ క్రమంలోనే ఇప్పుడు డైరక్టర్ గోపీచంద్ మలినేని కూడా పవర్‌‌‌‌ఫుల్‌‌ స్టోరీతో ఔట్‌‌ అండ్ ఔట్ యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ సినిమా తీస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న NBK 107 టైటిల్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ  నటిస్తున్న సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటుంది.

ప్రస్తుతం ఈ మూవీ టైటిల్‌‌ గురించి తెలుగు పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. రకరకాల టైటిల్స్  వినిపించాయి కానీ చివరికి ‘అన్నగారు’ అని పెట్టేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.  బాలయ్య తండ్రి అయిన నందమూరి తారక రామారావుగారిని అన్నగారు అని పిలిచేవారు. ఆ టైటిల్ అయితే జనాల్లోకి బాగా వెళ్తుందని భావించి ఫైనల్ చేసారని తెలుస్తోంది. అక్టోబర్ 21 న టైటిల్‌‌ని అనౌన్స్‌‌ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్‌‌ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసారు. అదిరిపోయే మాస్ ఎలివేషన్స్‌‌తో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారట రామ్‌‌, లక్ష్మణ్.

శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో దునియా విజ‌య్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ సినిమాతో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.  

శ్రుతీహాసన్ హీరోయిన్‌‌. ఇదిలా ఉంటే బోయపాటి, బాలయ్య కాంబోలో మరో మూవీ రాబోతోందనే గుసగుసలు మొదలయ్యాయి. ఇదో పొలిటికల్ డ్రామా అని, ‘లెజెండ్‌‌’కి సీక్వెల్ అని అంటున్నారు. ‘అఖండ’ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డియే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలీదు కానీ.. ఆల్రెడీ అనిల్ రావిపూడితో బాలయ్యకి కమిట్‌‌మెంట్ ఉంది. అలాగే రామ్‌‌తో బోయపాటి సినిమా ఫిక్సయ్యింది. ఈ రెండూ పూర్తయ్యాకే వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios