తండ్రి ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు బాలకృష్ణ. తాను నటిస్తున్న `ఎన్బీకే 107` నుంచి రేపు బిగ్‌ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు.

నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna) తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) జయంతి సందర్భంగా తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `NBK 107` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో శృతి హాసన్‌(Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తుంది. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌ మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్‌(Sr NTR) జయంతి సందర్భంగా రేపు శనివారం ఉదయం 10.20నిమిషాలకు ఈ చిత్రం నుంచి అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది యూనిట్‌. అయితే ఆ అప్‌డేట్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో టైటిల్‌ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్‌. మరి ఫ్యాన్స్‌ ని బాలయ్య(NBK) ఎలా సర్‌ప్రైజ్‌ చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ట్రెండ్‌ అవుతుంది. 

Scroll to load tweet…

`అఖండ` లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలయ్య హీరోగా వస్తోన్న సినిమా కావడం, `క్రాక్‌` వంటి హిట్‌ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, లీకైన లుక్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. మరి అంచనాలను సినిమా రీచ్‌ అవుతుందా? లేదా చూడాలి. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నట్టు టాక్‌. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

 `ఖిలాడీ` ఫేమ్‌ డింపుల్‌ హయతి ఇందులో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందని సమాచారం. ఇటీవల ఓ స్పెషల్‌ సాంగ్‌ని కూడా షూట్‌ చేశారు. మరోవైపు ఈసినిమాకి ఆసక్తికర టైటిల్‌ వినిపిస్తుంది. `అన్నగారు` అనే టైటిల్‌ ప్రధానంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దాన్నే ఫిక్స్ చేస్తారా? లేక మరేదైనా ఊహించని టైటిల్‌తో వస్తారా? అనేది చూడాలి.