నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ అందిస్తున్నారు మేకర్స్. గతంలో టైటిల్ పోస్టర్, నాని ఫస్ట్ లుక్, గ్లిమ్స్ రిలీజ్ చేయగా.. తాజాగా నజ్రియా ఫాహద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

నేచురల్ స్టార్ నాని (Naturalstar Nani) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రోల్ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు నాని. ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) గతేడాది ఊహించని ఫలితాలను అందించింది. ఆ ఊపులో నాని మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘అంటే సుందరానికీ’తో ప్రేక్షకుల ముందుుకు రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో నాని సరసన మలయాళ హీరోయిన్ నజ్రియా నజిమ్ ( Nazriya Nazim) నటిస్తోంది. నాని సుందర్ ప్రసాద్ పాత్ర పోషిస్తుండగా.. నజ్రియా లీలా అనే పాత్రలో నటిస్తూ అలరించనుంది.

కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ నర్ గా తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికీ’(Ante Sundaraniki)లో నాని బ్రాహ్మణుడిగా కనిపించనున్నాడు. హీరోయిన్ నజ్రియా లీలా థామస్ పాత్రలో నటిస్తూ ఫొటో గ్రాఫర్ రోల్ ను పోషిస్తోంది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నజ్రియా తాలుకా ఎలాంటి అప్డేట్ అందించకపోవడంతో తాజాగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది. కెమెరా చేతిలో పట్టుకొని ఎలాంటి ద్రుశ్యాన్ని క్లిక్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది నజ్రియా. బ్లూ షర్ట్, రెగ్యూలర్ బ్లూ జీన్స్ ధరించిన లీలా థామస్ నెటిజన్ల ద్రుష్టిని ఆకర్షిస్తోంది. నాని కూాడా ట్విట్టర్ లో నజ్రియాా ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేసి ‘అంటే సుందరానికీ హార్ట్ లాంటి మా లీలా థామస్ ను పరిచయం చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు.

Scroll to load tweet…

బ్రాహ్మణుడైన సుందర్ ప్రసాద్, ఫొటో గ్రఫీని ఎంచుకున్న ఈ రెండు విభిన్న లోకాలు.. ఎలా ఏకమవుతాయి.. ఇందుకు ఎలాంటి పరిస్థితులను వారు ఫేస్ చేయాల్సి ఉంటుందనే సినిమా కథాంశంగా అర్థమవుతోంది. నాని, నజ్రియా ఫహద్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు. నదియా, రాహుల్ రామకృష్ణ, సుహాస్ మరియు హర్షవర్ధన్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.