Asianet News TeluguAsianet News Telugu

‘నాయట్టు’ తెలుగు రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

 మార్టిన్ ప్రకట్ దర్శకత్వంలో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిష సాజయన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ పోందింది. 

Nayattu Telugu Remake have an interesting Title jsp
Author
First Published Jul 31, 2023, 9:46 AM IST

మ‌ల‌యాళంలో ఈ మథ్యకాలంలో  వ‌చ్చిన బెస్ట్ థ్రిల్ల‌ర్ ‘నాయట్టు’.  మార్టిన్ ప్రకట్ దర్శకత్వంలో  వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ పోందింది. జోజు జార్జ్‌తో పాటు కుంచుకో బోబ‌న్ ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది.  సమాజంలో ఉన్న లోపాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపిస్తూ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే ఈ సినిమా.. చూసిన‌ ప్రేక్ష‌కుల‌ను మర్చిపోవటం కష్టమే.

 పొలిటీయన్స్, ప్రభుత్వాధినేతలు ప్రజల మధ్య కులం కుంపట్లు పెట్టి… వ్యవస్థలను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకుంటారో.. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు ప్రభుత్వం కోసం పని చేసేవాళ్లు ఎలా బలిపశువులు అయిపోతారో ఈ సినిమాలో చాలా ప్రభావవంతంగా చూపించారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని చాలా కాలం నుంచి వార్తలు వచ్చినా  కార్య రూరం మాత్రం ఇప్పుడే దాల్చింది. 

అప్పట్లో రావు ర‌మేష్‌ను జోజు జార్జ్ పాత్ర‌కు ఎంపిక చేసి..పలాస ఫేమ్ క‌రుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి గీతా ఆర్ట్స్ సంస్థ స‌న్నాహాలు చేసిందని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఏం క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయో కానీ ఆ  కాంబో సినిమా ఆగిపోయింది.  గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఆ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా ని 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇందులో  జోజు జార్జ్ పాత్ర‌కు రావు ర‌మేష్‌ను కాకుండా సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్‌ను ఎంచుకున్నార‌ట‌. నిమిష పాత్ర‌కు శివాత్మిక రాజ‌శేఖ‌ర్, కుంచుకో బోబ‌న్ క్యారెక్ట‌ర్‌కు రాహుల్ విజ‌య్‌ల‌ను తీసుకున్నార‌ట‌. సినిమాలో కీల‌క‌మైన లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌తో చేయిస్తున్నార‌ట‌.

ఈ సినిమాకు కోట‌బొమ్మాళి పోలీస్ స్టేష‌న్ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.  అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - విద్యా మాధురి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా అని తెలిపారు. ఇంత‌కుముందు అనుకున్న దాని కంటే త‌క్కువ బ‌డ్జెట్లో ఈ సినిమాను తీస్తున్నార‌ట‌. ఆల్రెడీ షూటిగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios