పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నయన్-విగ్నేష్ జోడి.. ఈసారైనా..?
నయనతార, విగ్నేష్ శివన్‌లకు లవ్ లైఫ్ బోర్ కొట్టినట్టుంది. పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే డేటింగ్ బోర్ కొట్టినప్పుడు చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు బోర్ కొట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు.
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గాఢమైన ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా వీరిద్దరు బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా వీరి హంగామే కనిపిస్తుంది. పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే డేటింగ్ బోర్ కొట్టినప్పుడు చేసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు బోర్ కొట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరు అనధికారికంగా కలిసే ఉంటున్నారని టాక్. కానీ త్వరలో అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట.
ఈ మార్చి నెలలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు టాక్. ఇటీవల వీరిద్దరు జ్యోతిష్కుడిని సంప్రదించగా, ఆయన మార్చిలో ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. క్రిస్టియన్ సాంప్రదాయంలో జరుగుతుందా, లేక హిందూ సాంప్రదాయంగా జరుగుతుందా? అనేది డౌట్‌గా మారింది. అయితే ప్రస్తుతం మాత్రం నయనతార, విగ్నేష్ శివన్ ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతున్నారనే వార్త మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ఇప్పటికే నయనతార శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది. ప్రభుదేవాతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలోనే మ్యారేజ్ జరగబోతుందన్న క్రమంలోనే వీరిద్దరు విడిపోయారు. రెండుసార్లు బ్రేకప్ అయిన నయన్ కి, ఈ సారైనా తన పెళ్లి కల నెరవేరుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే దర్శకుడిగా రాణిస్తున్న విగ్నేష్.. నయనతార కంటే వయసులో చిన్నవాడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయనతార..విగ్నేష్ శివన్ దర్శకత్వంలో `కాథు వాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `నిజాల్`, `నెట్రికన్`, `అన్నాత్తే` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.