Asianet News TeluguAsianet News Telugu

సో స్వీట్.. అల్లు అర్జున్ ట్వీట్ కు నయనతార రిప్లై..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై స్వీట్ కామెంట్స్ చేసింది.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార. జవాన్ మూవీ గురించి బన్నీ పెట్టిన ట్వీట్ కు స్వీట్ రిప్లై ఇచ్చింది బ్యూటీ. 

Nayanthara Sweet Reply To Icon Star Allu Arjun JMS
Author
First Published Sep 18, 2023, 8:37 AM IST

షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'జవాన్' మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార.  తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది. ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవడంతో పాటు.. బ్లాస్టింగ్ కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ఈసినిమాతో హిందీ ఆడియన్స్ అభిమానాన్ని కూడా సాధించింది నయన్. ఏజ్ పెరుగుతన్నా కొద్ది ఆమె క్రేజ్ కూడా పెరుగుతూ వస్తోంది. 

ఇక జవాన్ సినిమా చూసి.. ఈ సినిమాకి రివ్యూ ఇచ్చి, ఆమె పర్ఫార్మెన్స్ ను అద్భుతం అంటూ.. కొనియాడిన సినీ ప్రముఖుల్లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. బన్నీ రివ్వూకి నయనతార తాజాగా స్పందించింది. స్వీట్ రిప్లై ఇచ్చి.. అందరి మనసులు గెలుచుకుంది. 
జవాన్' సినిమాను  చూసి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినందుకు ముందుగా 'జవాన్' బృందానికి శుభా కాంక్షలు. ఇది ఎప్పుడూ చూడని షారూక్ ఖాన్ గారి మాస్ అవతార్ అని అన్నారు షారుఖ్. 

అంతే కాదు ఆయన స్వాగ్ తో ఇండియానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఉర్రూతలూగించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్, మేము దీని కోసమో ప్రార్థించాము అని ట్వీట్ చేశారు.. ఇక విజయ్ సేతుపతి గారు ఎప్పటిలాగే తన పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. దీపికా పదుకొణె ప్రభావవంతమైన స్టార్. నయనతార జాతీయ స్థాయిలో ప్రకాశవంతంగా మెరిసింది. అనిరుధ్ మీరు దేశంలోని ప్రతి ఒక్కరినీ మీ సంగీతం వైపు తిప్పుకున్నారు. మనందరినీ గర్వపడేలా చేసినందుకు, ఆలోచింపజేసే కమర్షియల్ సినిమాని అందించినందుకు, భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినందుకు డైరెక్టర్ అట్లీ గారికి బిగ్ బిగ్ కంగ్రాట్స్." అంటూ అల్లు అర్జున్ పేరుపేరునా అందరినీ అభినందించారు.

ఇంత పెద్ద ట్వీట్ చేయడంతో.. బన్నీతో అట్లీ మూవీ దాదాపు  కన్ ఫార్మ్ అయినట్టే అన్న టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో.. అల్లు అర్జున్ ట్వీట్ కు లేడీ సూపర్ స్టార్ నయనతార స్వీట్ రిప్లై ఇచ్చారు.  ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ను  ఇన్ స్టా లో స్టోరీగా పెడుతూ..సో స్వీట్ ఆఫ్ యు అల్లు అర్జున్" అని రాసుకొచ్చింది నయనతార. ప్రస్తుతం నయన్ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు అంతకు ముందు ఈ ట్వీట్ కు బాలీవుడ్ బాద్ షా... షారూఖ్ ఖాన్ సైతం స్పందించారు.  తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు తెలిపారు.

"థాంక్యూ సో మచ్ మై మ్యాన్. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషంగా ఉంది. స్వాగ్ విషయానికి వస్తే ఫైరే నన్ను పొగుడుతోంది. వావ్.. చాలా సంతోషంగా ఉంది. ఈ ట్వీట్‌ తో 'జవాన్‌' విజయం రెట్టింపు అయిందనే అనుభూతి చెందుతున్నాను. 'పుష్ప' సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూశాను కాబట్టి నేను మీ నుండి  చాలా నేర్చుకున్నానని అనుకుంటున్నాను. తప్పకుండా మిమ్మల్ని పర్సనల్ గా కలుస్తాను అన్నారు షారుఖ్ ఖాన్. ఇక ఈసినిమాలో అల్లు అర్జున్ కూడా నటించాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios