మెగాఫ్యాన్స్ అంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆచార్య మూవీ నిరాశపచడంతో.. గాడ్ ఫాదర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ గురించి కూడా రూమర్స్ బయటకు వస్తున్న వేళ.. నయనతార పోస్టర్ రిలీజ్ చేసి.. మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 

మెగాఫ్యాన్స్ అంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆచార్య మూవీ నిరాశపచడంతో.. గాడ్ ఫాదర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ గురించి కూడా రూమర్స్ బయటకు వస్తున్న వేళ.. నయనతార పోస్టర్ రిలీజ్ చేసి.. మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గాడ్ ఫాదర్. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన మోహన్ లాల్ లూసీఫ‌ర్‌ కు రీమేక్‌గా తెలుగులో ఈమూవీ తెరకెక్కింది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేయబోతున్నారు టీమ్. ఈ క్ర‌మంలో గాడ్ ఫాదర్ మూవీ మేక‌ర్స్ వ‌రుస‌గా అప్‌డేట్‌ల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారుస్తున్నారంటూ.. కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్న వేళ.. వాటికి క్లారిటీ ఇస్తూ... సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ.. సినిమా నుంచి న‌య‌న‌తార పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు టీమ్. 

లేటెస్ట్‌గా గాడ్ ఫార్ మూవీ నుంచి న‌య‌న‌తార లుక్‌కు రిలీజ్ చేశారు టీమ్. ఇందులో న‌య‌న తార స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్‌గా క‌నిపించనుంది. ఈ లుక్ ను ఆడియన్స్ నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. మలయాళ మూవీ లూసీఫ‌ర్‌లో మంజు వారియ‌ర్ పోషించిన పాత్రలో న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే గాడ్ ఫాదర్ నుంచి రిలీజ్ ప్రతీ అప్ డేట్ కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. 

Scroll to load tweet…

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప‌దిహేనేళ్ళుగా సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ ఉంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా నయనతారే. ఏజ్ పెరుగుతుంటే ఆమె డిమాంట్ ఇంకా పెరుగుతోంది. రీసెంట్ గా పెళ్లి చేసుకన్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక విమెన్ సెంట్రిక్ మూవీస్ కు కేరాఫ్ ఆడ్ర‌స్ గా మారింది న‌య‌నతార‌. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. అందులో . 

ఇక గాడ్ ఫార్ సినిమాను రామ్‌చ‌ర‌ణ్‌, ఆర్.బి.చౌద‌రి, ప్ర‌సాద్ ఎన్‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స‌ల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌లు కీల‌క‌పాత్ర‌లు పోషించారు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.