రీసెంట్ గా నయనతార, విగ్నేష్ దంపతులు కుంభకోణం సమీపంలో కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది. ఈ చిత్రంలో నయన్ బికినీ సన్నివేశాల్లో కూడా నటించబోతుందనేది హాట్ న్యూస్. అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటోందట.
ఇది పక్కన పెడితే నయనతారకి ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. ఒకవైపు భర్త పిల్లలు, మరోవైపు షూటింగ్స్ తో నయన్ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. రీసెంట్ గా నయనతార, విగ్నేష్ దంపతులు కుంభకోణం సమీపంలో కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నయనతార లాంటి క్రేజీ సెలెబ్రిటీ ఇలా పబ్లిక్ లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. పైగాఅలాంటి ప్రాంతాల్లో సెక్యూరిటీ కల్పించడం కూడా పోలీసులకు కత్తిమీద సామే.
ఈ క్రమంలో నయనతార, విగ్నేష్ తమ పిల్లల కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజ చేస్తున్నప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోపల నయన్ పూజ చేస్తుంటే గుడి బయటే భక్తులు పెద్ద ఎత్తున చేరారు. పదే పదే నయనతారకి చిరాకు పుట్టిస్తూ కనిపించారు. ప్రశాంతంగా పూజ కూడా చేయలేకపోవడంతో నయన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడి గుమ్మం దగ్గరకి వచ్చి భక్తులతో మాట్లాడింది.
మేము కూడా మీలాగే అమ్మవారి దర్శనానికి వచ్చాం. 5 నిమిషాలు ఆగితే పూజ పూర్తవుతుంది. ఐదు నిమిషాలు కూడా ఆగలేరా అంటూ నయన్ అసహనం వ్యక్తం చేసింది. ఇంతలో విగ్నేష్ శివన్ కల్పిచుకుని భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొందరు భక్తులు అర్థం చేసుకుని వెళ్లి పూజ చేసుకోండి మేడం అని చెప్పారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
