Asianet News TeluguAsianet News Telugu

స్పెయిన్ లో త్రివర్ణ పతాకం ఎగరవేసిన నయనతార, పరదేశంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసిన కోలీవుడ్ జంట

స్పెయిన్‌లో మన దేశ  త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోలీవుడ్ కొత్త జంట   నయనతార, విగ్నేష్‌ శివన్‌ ఆ దేశంలో ఇండిపెండెన్స్‌ డేను ఘనంగా జరుపుకున్నారు.
 

Nayanthara and vignesh Celebrate independence day in spain
Author
Hyderabad, First Published Aug 16, 2022, 10:02 AM IST

సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌ గా పేరు తెచ్చుకుంది నయనతార. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన మార్క్ సినిమాలో అలరిస్తూ వస్తున్న ఆమె.. రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడింది. దాదాపు ఐదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న వీరు వివాహబంధంతో ఒకటయ్యారు. ఇక టైమ్ దొరికితే చాలు విదేశీవిహారయాత్రలతో సందడిచేస్తున్నారు. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ జంట స్పెయిన్ చేరింది. అక్కడ సందడి చేస్తోంది. 

ఇక నయనతార తన  భర్త విగ్నేష్‌ శివన్‌ తమ దేశభక్తిని చాటుకున్నారు. నిన్న( సోమవారం ఆగస్ట్‌ 15) 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశమంతా ఉత్సవాలతో మారుమోగిపోయింది. ఇంటింటికీ జాతీయ జెండా ఎగరవేసి మరీ.. ఈ ఉత్సవాలు  ఘనంగా జరుపుకున్నారు మన ప్రజలు. కాగా ఈ సమయానికి స్పెయిన్‌ టూర్‌లో ఉన్న ఈ జంట మాత్రం అక్కడ 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. స్పెయిన్ లో త్రివర్ణ పతాకంతో సందడి చేశారు ఇద్దరు తారలు. 

స్పెయిన్ లోని బార్సిలోనా వీధుల్లో నయన్‌, విగ్నేష్‌ మన జాతీయ  జెండాను చెరో వైపూ పట్టుకొని వీధులన్నీ కలియతిరిగారు. సోమవారమంతా వీళ్లు ఎటు వెళ్లినా ఇలా చేతుల్లో పతాకంతోనే కనిపించారు. అక్కడి వారికి మన దేశ గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక  వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు  ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంట దేశభక్తిని చూసి వారి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. మంచి పని చేశారంటూ నయన్ ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుందన్నారు. 

 

హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో మన దేశంలో  ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న వేళ.. ఎక్కడో ఉన్న స్పెయిన్‌లో నయనతార, విగ్నేష్‌ శివన్ లు  ఇలా మన పతాకాన్ని ఇతర దేశంలో  ప్రదర్శించారు. ఇక పెళ్ళి తరువాత  వరుసగా ప్రేమ యాత్రలను చేస్తుంది ఈ జంట. ఇటు షూటింగ్స్ చూసుకుంటూనే .. షూటింగ్ షూటింగ్ మధ్య గ్యాప్ యూస్ చేసుకుంటున్నారు. 

ఇక రీసెంట్ గా  స్పెయిన్‌కు వెళ్తున్న టైమ్ లో ఫ్లైట్‌లో రొమాన్స్‌ చేస్తూ.. హాట్ టాపిక్ అయ్యారు నయన్ , విష్నేష్ లు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో కోన్ని విమర్షలు కూడా వచ్చాయి వీరిపై.స్పెయిన్‌లో హాయిగా విహరిస్తున్న ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తున్నారు ఈ కోలీవుడ్ జంట.నయన్‌ ప్రస్తుతం షారుక్‌ఖాన్‌తో కలిసి జవాన్‌ మూవీలో నటిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇదే.   జూన్‌ 9న జరిగిన వీరి పెళ్ళికి  షారుక్‌ కూడా వచ్చి సందడి చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios