ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం, ఇద్దరితో కలిసి ఉండాలనుకునే హీరో స్టోరీనే ఈ సినిమా. ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉండటం వల్ల వచ్చే కష్టాలను విఘ్నేశ్ శివన్ ఎంతో సరదాగా చూపించినట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది.
సమంత, నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. ఈ సినిమా ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే పేరుతో తెలుగులో విడుదలకానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర టీమ్ ప్రమోషన్స్ మొదలెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా లవ్, కామెడీ నేపథ్యంలో రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. కణ్మని పాత్రలో నయనతార, రాంభోగా విజయ్ సేతుపతి, ఖతిజా కారెక్టర్‌లో సమంత నటించారు.
ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం, ఇద్దరితో కలిసి ఉండాలనుకునే హీరో స్టోరీనే ఈ సినిమా. ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉండటం వల్ల వచ్చే కష్టాలను విఘ్నేశ్ శివన్ ఎంతో సరదాగా చూపించినట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. నిన్ను మొదటి సారిగా చూసినప్పుడే ప్రేమించాను అంటూ ఇద్దరికీ ఒకే సారి చెబుతాడు. మొట్టమొదటిసారి ఏరోజైతే నీ లవ్ నాతో చెప్పావో.. ఆరోజు నుంచే నా జీవితం అందంగా మారిందంటూ మళ్లీ ఇద్దరినీ చూపిస్తూ చెబుతుంటాడు.
ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో ఇద్దరినీ ఎందుకు ప్రేమించాడు..? దానికి వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ‘టూ టుటు టుటూ..’ అనే పాట బాగా వైరల్ అయింది. తమిళనాటను ఓ ఊపు ఉపేసింది ఈ సాంగ్. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయనున్నారు. మరి తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
