Asianet News TeluguAsianet News Telugu

నిజమా?: సత్యదేవ్‌కు భార్యగా నయనతార

ఈ చిత్రంలో మెగాస్టార్‌ సోదరిగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో వివెక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేస్తున్నాడు.
 

Nayantara as Satyadev Wife in Chiranjeevi movie
Author
Hyderabad, First Published Aug 20, 2021, 9:58 AM IST

వినటానికి కొంచెం వింతగా ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. నయనతార సరసన సత్యదేవ్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నయనతార వంటి స్టార్ ..మీడియం రేంజి హీరోగా ఉన్న సత్యదేవ్ ప్రక్కన చేయటం అనేది మాత్రం ఆశ్చర్యకరమే. అందులోనూ సత్యదేవ్ కు ఆమె అక్కలా కనిపిస్తుంది అంటున్నారు.కాకపోతే కథ డిమాండ్ మేరకు ఈ పెయిర్ తో ముందుకు వెళ్తున్నారు అంటున్నారు.

వివరాల్లోకి వెళితే...మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్‌ ‘లూసిఫర్‌’ మూవీ రీసెంట్ గా మొదలైన సంగతి  తెలిసిందే.  ఈమధ్యనే ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘లూసిఫర్‌’ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో నటించే మిగతా నటీనటుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ పెయిర్ విషయం  బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్‌ సోదరిగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో వివెక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేస్తున్నాడు.

దాన్ని బట్టి ఈ మూవీలో సత్యదేవ్‌కు నయనతార భార్యగా కనిపించనుందని తేలింది. ఈ పాత్రకు నయన్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.  స‌త్య‌దేవ్ సైతం తన కెరీర్ కు ఈ చిత్రం పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌న‌ని భావిస్తున్నారట. కాగా బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ చెందిన స్టార్‌ నటీనటులు ఈ మూవీలో భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా.. తమిళంలో పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపించనున్నట్లు తెలుస్తోంది.  లూసిఫర్ అనేది కేరళ క్రిస్టియన్ పేరు కావడంతో... ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పేరు ఏం పెట్టాలా అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందంట.   తెలుగు రీమేక్‌లో గాడ్‌ ఫాదర్‌ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తమన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. కాగా, ఇప్పుడు టైటిల్‌ను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారు దర్శకుడు మోహన్‌రాజా.
 

Follow Us:
Download App:
  • android
  • ios