బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన సైరా ట్రైలర్ లో విజువల్స్ తో పాటు భారీ తారాగణం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. దాదాపు 250కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం నయనతరం రెమ్యునరేషన్ కి సంబందించిన మరో న్యూస్ అందరిని షాక్ కి గురి చేస్తోంది. 

ఈ సినిమా కోసం నయన్ సౌత్ ఇండియాలోనే అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా 6కోట్లకు పైగా అందుకున్నట్లు టాక్. అంటే ఒక మీడియం హీరో కంటే హై రేంజ్ లో నయనతారకు రెమ్యునరేషన్ దక్కినట్లు చెప్పవచ్చు. గజిని సినిమా నుంచి జయాపజయాలతో సంబంధం  లేకుండా నయనతార అవకాశాలు అందుకుంటోంది. 

ఆమెపై రూమర్స్ ఎన్ని ఉన్నా ప్రమోషన్స్ కి రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. నయనతార ఒక పాత్రకు సెట్టవుతుంది అంటే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఆమెను ఫిక్స్ చేస్తున్నారు. ఇక సైరా సినిమా అక్టోబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆరు కోట్ల పారితోషికాన్ని అందుకున్న నయనతార తన పాత్ర కోసం ఎంత కష్టపడిందో అప్పుడే తెలుస్తుంది. వెయిట్ అండ్ సి.