టైట్‌ రొమాన్స్ లో మునిగితేలుతున్న నయనతార.. రజనీకాంత్‌ కోసం తన ప్రియుడిని వదిలేసింది. ఆయన్ని వదిలేసి హైదరాబాద్‌కి వచ్చింది. అంతేకాదు రజనీ కోసం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఆమె ల్యాండ్‌ అవ్వడం విశేషం. 

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌తో ఘాఢమైన ప్రేమలో మునిగితేలుతుంది. ప్రతి అకేషన్‌ని స్పెషల్‌గా మల్చుకుంటూ వీరిద్దరు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరు జంటగా వెళ్తున్నారు. `నిను వీడని నీడను నేనే` అనేలా వ్యవహరిస్తున్నారు. ఇంతగా టైట్‌ రొమాన్స్ లో మునిగితేలుతున్న నయనతార.. రజనీకాంత్‌ కోసం తన ప్రియుడిని వదిలేసింది. ఆయన్ని వదిలేసి హైదరాబాద్‌కి వచ్చింది. అంతేకాదు రజనీ కోసం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఆమె ల్యాండ్‌ అవ్వడం విశేషం. 

రజనీకాంత్‌ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌. ఆమె కూతురుగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. మీనా, ఖుష్బు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల మళ్లీ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్‌ కోసం నయనతార హైదరాబాద్‌కి స్పెషల్‌ ఫ్లైట్‌లో రావడం విశేషం. ఓ చార్టెర్డ్ ఫ్లైట్‌లో ఆమె షూటింగ్‌ స్పాట్‌కి చేరుకున్నట్టు టాక్‌. ఇందులో మొన్నటి వరకు రజనీకాంత్‌, జగపతిబాబు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు నయన్‌ పాల్గొనబోతుంది. రజనీ, నయన్‌ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించే అవకాశాలున్నాయట. దీనికి శివకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్‌ 4న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

దీంతోపాటు నయనతార తన ప్రియుడు విగ్నేష్‌ శివన్‌ రూపొందిస్తున్న `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే `నెట్రికన్‌` అనే మరో సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే త్వరలోనే విగ్నేష్‌, నయన్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు టాక్‌.