మెగా ప్రొడ్యూసర్స్  అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ పౌరాణిక చిత్రాన్ని చేస్తున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఇతిహాసాలలో గొప్పదైన రామాయణ మహా కావ్యాన్ని తెరకెక్కించేందుకు ఆయన స్క్రిప్టు రెడీ చేసుకున్నారు.”రామాయణ” పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణ భాగస్వాములుగా కలిసి నిర్మిస్తున్నారు.  

1500 కోట్ల బడ్జెట్ గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో నటీనటులుగా ఎవరు కనిపించబోతున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. మరీ ముఖ్యంగా రామడు, సీత,రావణాసురుడు పాత్రల్లో ఎవరు సెలక్ట్ అయ్యారని నటీనటులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దాదాపు మూడేళ్ల పాటు డేట్స్  కావాల్సి ఉంటుందని, కాబట్టి అలా కేటాయించేవాళ్ళకే అవకాసం అని టీమ్ అంటోందిట.  ఈ నేపధ్యంలో సీతగా నటి నయనతారను అడిగారని, ఆమె పాజిటివ్ గా స్పందించారని సమాచారం. అయితే తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నటించడానికి కాల్‌షీట్స్‌ ఎలా సర్దుబాటు చేస్తుందనేదే  చర్చనీయంగా మారింది. 

మూడు భాగాలుగా రాబోతున్న ఈ  చిత్ర తొలి భాగాన్ని 2021లో విడుదల చేయాలన్ని నిర్ణయించినట్లు తెలిసింది.  ఈ ప్రాజెక్టుపై టీమ్ గత రెండేళ్లు గా పనిచేస్తోంది. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించ‌బోతున్నారు. అంతేకాదు.. సినిమా మొత్తం 3డిలోనే షూట్ చేయ‌బోతున్నారు. 

మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ “రామాయణ” చిత్రానికి ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి, ‘మామ్’ మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 2021వ సంవత్సరంలో మొదటి భాగం విడుదల కానున్న ఈ చిత్రం లోని నటులు, సాంకేతిక వర్గానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.