"వాసుకి" మూవీ రివ్యూ..

  • చిత్రం: వాసుకి
  • తారాగణం: నయనతార, మమ్ముట్టి, బేబీ అనన్య, శీలూ అబ్రహం తదితరులు
  • దర్శకత్వం: ఏకే సాజన్
  • నిర్మాత: ఎస్ఆర్ మోహన్
  • సంగీతం: గోపి సుందర్
  • నిడివి: 2 గంటల 14 నిమిషాలు
  • రిలీజ్: 2017 జూలై 28
  • ఆసియానెట్ రేటింగ్- 3/5
nayanatara vasuki movie review

దక్షిణాదిలో నయనతారకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగు, తమిళం, మళయాళం ఇలా ఏ భాషలో నయనతార నటించినా… ఆమె సినిమా గురించి వెయిట్ చేస్తుంటారు. అంతటి క్రేజ్ ఉన్న నయన్ లీడ్ రోల్ లో నటించిన మళయాళ సూపర్ హిట్ మూవీ పుతియా నియామమ్.. తెలుగులో వాసుకిగా వచ్చింది. నయనతార మెయిన్ లీడ్ లో నటించడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. మమ్ముట్టి కూడా నటింటిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్స్ కు మంచి స్పందన లభించడంతో బిజినెస్ కూడా బాగా జరిగిందని సమాచారం. ఇంతకి వాసుకి కథేంటి… ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించగలదో చూద్దాం.

కథ:

వాసుకి (నయనతార) కథాకళి డ్యాన్సర్. భర్త వెంకట్ (మమ్ముట్టి) న్యూస్ ఛానెళ్లో పనిచేస్తుంటాడు. అలాగే అడ్వకేట్ కూడా. ముఖ్యగా డైవర్స్ కేసులు డీల్ చేస్తుంటాడు. వీరికి స్కూల్ కి వెళ్లే పాప ఉంటుంది. వాసుకి జీవితంలో సుధీర్ వర్మ, ఆర్య, పాండు అనే ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి ఆమెను మానభంగం చేస్తారు. దాంతో భర్తతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ.. జరిగినదేంటో తన భర్తకు ఫ్యామిలీకి తెలియకుండా రివెంజ్ తీర్చుకోవాలనుకుటుంది. దీని కోసం పోలీస్ ఆఫీసర్ (షీలూ అబ్రహం) సహాయం తీసుకుంటుంది. వాసుకి ఎలా రివెంజ్ తీర్చుకుంది. తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఎలా వుందంటే :

చక్కగా సాగుతున్న ఓ మహిళ జీవితంలో దారుణ ఘటన చోటుచేసుకొంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. తనకు జరిగిన అన్యాయానికి పగను ఎలా తీర్చుకుంటుంది అనే సింపుల కథను వెండితెర మీద వాసుకీగా మలిచాడు దర్శకుడు ఏకే సాజన్. మమ్ముట్టి, నయనతార దాంపత్య జీవితం, వారి మధ్య ఉన్న ప్రేమానురాలను ఎస్టాబ్లిష్ చేయడానికి తొలి భాగాన్ని దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకొన్నాడు.  సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచే సంఘటనను దర్శకుడు చాలా బాగా ప్లాన్ చేశాడు. మొదటి సగ భాగంలో వాసుకి ఫ్యామిలీ గురించి... వాసుకికి జీవితంలో అనుకోని ఓ సంఘటన జరిగిందనే విషయాన్ని అండర్ కరెంట్ గా చూపిస్తూ వచ్చాడు. అసలు స్టోరీ అంతా రెండో భాగంలోనే ఉంటుంది. ప్రథమార్థం సాదా సీదాగా వెళ్తుంది. కానీ రెండ అర్థభాగంలోనే అసలు కథంగా నడిపించాడు. ముగ్గురు యువకులు ఎవరు.. వారు చేసిన పనుల్ని చూపించాడు. నయనతార ఇబ్బంది పడే విధానాన్ని భర్త తీరు తెన్నుల్ని బాగా చూపించాడు. పోలీస్ ఆఫీసర్ సాయం తీసుకోవడం ఓ హైలైట్ అయితే... అనుకోకుండా భర్త తెరమీదకి రావడం.. అతని స్క్రీన్ ప్లే క్లైమాక్స్ పార్ట్ లో హైలైట్ గా ఉంటుంది. రివెంజ్ డ్రామాను చాలా కొత్తగా చూపించాడు. నయనతారపై జరిగే రేప్ సన్నివేశాన్ని ఉద్వేగభరితంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఆ తర్వాత నయనతార చేసే మూడు హత్యలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. టెక్నాలజీని వాడుకొని ఎలా రివెంజ్ తీర్చుకోవచ్చో చూపించారు. మహిళలు ధైర్యంగా ఉండాలనేది... మగవారు సహనంగా ఉండాలని దర్శకుడు మెసేజ్ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే పరంగా ఫుల్ మార్కులు కొట్టేశాడు. రోబీ వర్ఘీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇంటలిజెంట్ గేమ్ ప్లే, దర్శకుడి స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి.

 

నటీనటులు:

వాసుకి పాత్రలో నయనతార పెర్ ఫెక్ట్ గా సరిపోయింది. ఈ తరహా క్యారెక్టర్లో కనిపించేందుకు పెద్ద హీరోయిన్లు సాధారణంగా ఇష్టపడరు. కానీ నయనతార డేరింగ్ డెసిషన్ తీసుకుంది. మమ్ముట్టి నయనతార జంట బాగుంది. మమ్ముట్టి క్యారెక్టర్ ఫస్టాఫ్ లో సింపుల్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మొత్తం అతనిదే. అతనే కథకు ముగింపు పలుకుతాడు. ముగ్గురు యువకులు కూడా చాలా బాగా చేశారు. పాత్రలకు సరిగ్గా సరిపోయారు. గోపిసుందర్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తెలుగులో శ్రీరాం సినిమాస్ బ్యానర్ పై రిలీజ్ చేసిన నిర్మాత ఎస్.ఆర్.మోహన్ డబ్బింగ్ సైతం బాగా చేయించారు. దర్శకుడు ఏకె సాజన్ సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఉండడంతో కథకు బలంచేకూరింది. మమ్ముట్టి, పోలీసాఫీసర్ క్యారెక్టర్లని కూడా బలంగా వుండేలా చూసుకున్నాడు. వాసుకిగా నయనతార పెర్ ఫార్మెన్స్,  సెకండాఫ్ లో కథ వేగం, మమ్ముట్టి పాత్ర అలరిస్తాయి.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు నయనతార నటన ప్రధాన ఆకర్షణగా నిలవగా దర్శకుడు కథను స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి విను థామస్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. కీలక సన్నివేశాలు హైలెట్ కావడానికి రీరికార్డింగ్ చాలా దోహదపడింది. మ్యూజిక్ అదనపు ఆకర్షణ వాసుకీ సినిమాకు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. రోబీ వర్గీస్ రాజ్ అందించిన ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కేరళలోని పచ్చని వాతావరణాన్ని చక్కగా చిత్రీకరించారు. వివేక్ హర్షన్ తొలి భాగంలో కొంత అనవసరమైన సన్నివేశాలపై దృష్టిపెట్టి ఉంటే ఎడిటింగ్ బాగుండేదోమో అనిపించింది.

 

మైనస్ పాయింట్స్ :

చివరి వరకు ట్విస్ట్ కోసం ప్రేక్షకుడు వేచి చూడాల్సి రావడం ఈ సినిమాలో మైనస్ పాయింట్. ఇటీవల వచ్చిన మామ్ సినిమా కూడా ఇలాంటి కథతోనే రూపొందడం మరో మైనస్ పాయింట్. సినిమాకు అంతా తానైన నయన ఎప్పటిలానే వాసుకీ సినిమాను తన భుజాలపై మోసింది. అంతగా ప్రాధాన్యం లేని పాత్రను మమ్ముట్టి ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. క్లైమాక్స్‌ లో నాలుగు సీన్లు లేకపోతే ఓ ఆర్డినరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగిపోయేవాడనిపిస్తుదంది. వాసుకీలో మిగితా పాత్రల గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. పెద్దగా నటనకు స్కోప్‌ లేని పాత్రలే కనిపిస్తాయి. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవడం వల్ల ఆ పాత్రలపై ఆసక్తి కలుగదు.

 

చివరగా :

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios