కోలీవుడ్ ప్రేమ జంట విగ్నేష్ శివన్-నయనతార లైఫ్ ని వీర లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ముఖ్య వేడుకను కలిసి జరుపుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఓనమ్ వేడుకకు నయనతార ప్రైవేట్ జెట్ లో విగ్నేష్ ని కేరళ తీసుకెళ్లింది. నయనతార కుటుంబ సభ్యులతో కలిసి విగ్నేష్ ఓనమ్ గ్రాండ్ గా జరుపుకున్నారు. సాంప్రదాయ బట్టలు ధరించిన ఈ జంట ఓనమ్ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. 

కాగా విగ్నేష్ తన 35వ పుట్టినరోజు జరుపుకున్నారు. సెప్టెంబర్18 విగ్నేష్ పుట్టిన రోజు నేపథ్యంలో నయనతార గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. విగ్నేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఏ జంట గోవా వెళ్లారు. అక్కడ మూడు రోజులు విగ్నేష్ శివన్, నయనతార గడిపారు. ఇష్టమైన ఫుడ్, ఖరీదైన పానీయాలు సేవిస్తూ లేట్ నైట్ డిన్నర్లు ఆస్వాదించారు. ఏకాంతంగా విగ్నేష్, నయన గోవాలో ప్రేమ పక్షులై విహరించారు. ఐతే ఈ  ట్రిప్ కోసం నయనతార చేసిన ఖర్చు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేసిన విగ్నేష్-నయనతార అక్కడ లగ్జరీ హోటల్ రూమ్స్ రెంట్స్ కోసం, గిఫ్ట్స్ కొరకు, విహారాలకు  మొత్తంగా 25లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిందట. కేవలం మూడు రోజుల ట్రిప్ కోసం నయనతార అంత మొత్తంలో ఖర్చు పెట్టగా, నయనతారకు ప్రియుడు విగ్నేష్ అంటే ఇంత ప్రేమా అని చెప్పుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం అని అంటున్నారు.