కోలీవుడ్ ప్రేమ జంట నయనతార-విగ్నేష్ శివన్ కొచ్చి లో ప్రత్యేక్షం అయ్యారు. ఓ స్పెషల్ ఫ్లైట్ లో చెన్నై నుండి కొచ్చి కి వీరు చేరినట్లు తెలుస్తుంది. ఓనం పండుగ నేపథ్యంలో కేరళలోని తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాడిని ప్రియుడు శివన్ తో పాటు కొచ్చిలో నయనతార దిగింది. సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ లవ్ కపుల్ గా ఉన్న నయనతార -విగ్నేష్ ప్రతి కదలికపై మీడియా కన్ను ఉంటుంది. దీనితో అలా స్పెషల్ ఫ్లైట్ దిగారో లేదో కెమెరా కంటికి దొరికారు. 

ముఖ్యంగా గాగుల్స్ పెట్టుకొని ఉన్న నయనతార డ్రెస్సింగ్ స్టైల్ కేక పుట్టించేదిగా ఉంది. పండక్కి ప్రియుడిని నయనతార ఇంటికి తీసుకెళ్లడంతో పెళ్ళికాకుండా అల్లుడుగా అన్ని మర్యాదలు ఇస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు.  ఇక వీరి పెళ్లి గురించి రోజుకో వార్త  వస్తుండగా ఇప్పట్లో ఆ ఆలోచన లేదని దర్శకుడు విగ్నేష్ శివన్ తేల్చివేశారు. డేటింగ్ హ్యాపీగా ఉందన్న విగ్నేష్, అది బోర్ కొట్టినాక పెళ్లి గురించి ఆలోచిస్తాం అన్నారు. 

ఇప్పటికే నయనతార శింబు, ప్రభుదేవాలతో  ఏళ్ళ తరబడి ప్రేమ వ్యవహారం నడిపి బ్రేక్ అప్ చెప్పేసింది. దీనితో విగ్నేష్ తో అయినా ఆమె ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా అనే అనుమానం అందరిలో మొదలైంది. కనీసం విగ్నేష్ శివన్ మీడియా కథనాలకు స్పందిస్తున్నారు. నయనతార మాత్రం ఇంత వరకు ఈ విషయంపై మాట్లాడింది లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకున్న నయనతార వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది.