బాలీవుడ్ లో విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ ఒకరు. ఎలాంటి పాత్రలో అయిన నవాజుద్దీన్ పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. ఇటీవల నవాజుద్దీన్ సౌత్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు.
బాలీవుడ్ లో విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ ఒకరు. ఎలాంటి పాత్రలో అయిన నవాజుద్దీన్ పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. ఇటీవల నవాజుద్దీన్ సౌత్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ నవాజుద్దీన్ ని తమ చిత్రాల్లో పెట్టుకుంటున్నారు.
అయితే నవాజుద్దీన్ నటిస్తున్న చిత్రాలకు ఆశించిన రిజల్ట్ రావడం లేదు. ఆ మధ్యన నవాజుద్దీన్ రజనీకాంత్ పేట చిత్రంలో నటించిన. ఆ మూవీ సోసో గానే ఆడింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సైంధవ్ చిత్రంలో ప్రధాన విలన్ గా నటించారు. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
రీసెంట్ గా ఓ కార్యక్రమంలో నవాజుద్దీన్ సౌత్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సౌత్ చిత్రాల్లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తుండడం వల్లే నటిస్తున్నాను అంటూ నవాజుద్దీన్ అన్నారు. కేవలం డబ్బు కోసమే ఆ పాత్రలు చేస్తున్నా. కానీ నేను నటిస్తున్న పాత్రల్లో నాకు ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు. ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నా. బహుశా లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కావచ్చు.
ఎవరో ఒకరు వచ్చి సన్నివేశాన్ని వివరించాల్సి వచ్చింది. కొన్నిసార్లు నాకు ఏదో యాడ్ షూటింగ్ లో నటిస్తున్నట్లు ఉంది. నా పాత్రపై నాకు పట్టు దొరకడం లేదు అని అన్నారు. అందుకు నేను నిజంగా సిగ్గు పడుతున్నా అంటూ నవాజుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
