టాలీవుడ్ లో యువ హీరోలు డిఫరెంట్ కథలతో ఇండస్ట్రీని తెగ ఆకర్షిస్తున్నారు. వారికి సెట్టయ్యే కథలతో ప్రయోగాలు చేస్తూ బడా ప్రొడక్షన్స్ లలో అవకాశాలను అందుకుంటున్నారు. రీసెంట్ గ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో సక్సెస్ అందుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి బంపర్ అఫర్ కొట్టేశాడు. 

వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో నవీన్ మంచి అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మహానటి సినిమాను నిర్మించిన స్వప్న సినిమాస్ మంచి గుర్తింపును తెచ్చుకుంది.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మించాలని నిర్మాత అశ్వినీదత్ కూతుళ్లతో ఈ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. 

స్వప్న సినిమాస్ నెక్స్ట్ మరో కొత్త దర్శకుడితో ఒక ప్రయోగాత్మకైనా కథను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంది. ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టిని హీరోగా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వెలువడనుంది.