అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయమైనా నవీన్ చంద్ర కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసారి తోటి కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే తను కూడా హీరోగా డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. 

రీసెంట్ గా హీరో హీరోయిన్ అనే సినిమా టీజర్ ను వదిలి వైరల్ అయ్యేలా చేసిన నవీన్ మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. సినిమా టైటిల్ కూడా కొత్తగా ఉంది. 28°C అనే సినిమాతో కొత్త ప్రయోగమే చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. 

అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షాలిని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ట్రైలర్ అండ్ టీజర్స్ తో రెగ్యులర్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి నవీన్ చంద్ర ఎంతవరకు ఆజట్టుకుంటాడో చూడాలి.