తెలుగులో థ్రిల్లర్ సినిమాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. విభిన్న కథా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూండటం,తక్కువ బడ్జెట్ ఈ తరహా సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా  న‌వీన్ చంద్ర‌, షాలిని, వ‌డ్నిక‌ట్టి హీరో హీరోయిన్‌గా డా.అనీల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `28°c`టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మరో ప్రక్క ప్రమోషన్ కార్యక్రమాలు సైతం షురూ చేసారు. అందులో భాగంగా చిత్రం టీజర్ ని విడుదల చేసారు. 

‘మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురికావడం వల్ల బ్రెయిన్‌ దెబ్బతింది. ఇలాంటి సమస్యను నేను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. చుట్టూ స్థిరమైన ఉష్ణోగ్రతను ఉంచుకోవాలి. లేకపోతే 10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు’ అని వైద్యుడు వివరించే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా..?’ అంటూ  టీజర్ చివర్లో క్యూరియాసిటీని పెంచుతూ  ప్రశ్నించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్ ని చూస్తే అర్దమవుతోంది . త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

నిర్మాత అభిషేక్ సాయి మాట్లాడుతూ – “28°c అనే టైటిల్ అంద‌రిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. న‌వీన్‌చంద్ర‌గారికి ఈ సినిమాతో మంచి హిట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. డా.అనీల్ విశ్వ‌నాథ్‌గారు స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు. శ‌్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. 

వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ‌గారు క‌థ‌కు త‌గ్గ మాట‌లు, మ్యూజిక్‌కి అనుగుణంగా పాట‌లను అందించారు. సినిమా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త‌ర్వ‌లోనే సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

 

న‌వీన్ చంద్ర‌, షాలిని, వ‌డ్నిక‌ట్టి, ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష‌, రాజా ర‌వీంద్ర‌, అభ‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్‌, పాట‌లు: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌, సంగీతం: శ‌్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, స‌హ నిర్మాత‌: విక్ర‌మ్ జుపూడి, సంజ‌య్ జుపూడి, నిర్మాత‌: అభిషేక్ సాయి, ద‌ర్శ‌క‌త్వం: డా.అనీల్ సాయి.