Asianet News TeluguAsianet News Telugu

కరణ్ జోహార్ పై నాని షాకింగ్ కామెంట్స్, ఆయన పిలిచినా వెళ్ళనన్న నేచురల్ స్టార్..

ఈమధ్య కాంట్రవర్షియల్ కామెంట్స్ తో  వైరల్ అవుతున్నాడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. అవి వైరల్ అవ్వడంతో.. క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు ..నాని. అయితే ఈసారి బాలీవుడ్ పై నోరు జారాడు. 
 

Natural Star Nani Shocking Comments about Karan Johar JmS
Author
First Published Nov 11, 2023, 10:55 AM IST


వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆమధ్య వరుస ఫెయిల్యూర్స్ చూసిన నాని. ఈమధ్య దసరా సినిమాతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. అంతే కాదు ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేస్తూ.. మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు నాని. మరో విశేషం ఏంటంటే.. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తూ.. దూసుకుపోతున్నాడు. కొత్తవారికి కూడాఛాన్స్ లు ఇస్తూ..మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ఈ విషయంలో నాని రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. 

నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈమధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో హైలెట్ అవుతున్నాడు నాని.  సినిమాలకు సంబంధిన కొన్ని అంశాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. ఇక ఇప్పుడు  తాజాగా బాలీవుడ్ పై.. అందులోను స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ పై నాని కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.  ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాని బాలీవుడ్  కరణ్ జోహార్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోకి పిలిస్తే వెళ్తారా అని అడగ్గా.. నాని దీనికి సమాధానమిస్తూ.. కాఫీ విత్ కరణ్ షోకి పిలిచినా రాను అని గౌరవంగా చెప్పేస్తాను. కరణ్ జోహార్ ని కలిసి, సినిమాల గురించి కాసేపు మాట్లాడమంటే ఓకే కానీ ఆ షోకి మాత్రం వెళ్ళను. నాలాంటి వాళ్లకి ఆ షో సెట్ అవ్వదు అని అన్నాడు. దీంతో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అయితే చాలా పాపులర్ షోగా పేరు తెచ్చుకున్న హిట్ టాక్ షో కాఫీ విత్ కరణ్. కాని ఈ షో అంటే చాలా మందికి నెగెటీవ్ ఫీలింగ్ ఉంది. మరీ ముక్యంగా సెలబ్రిటీలు ఈ షోకు వెళ్ళడానికి ఇష్టపడరు.. కొంత మంది భయపడతారు కూడా. ఈ షోలో కరణ్ సినిమాల వరకూ అడిగితే బాగుండేంది. కాని సెలబ్రిటీల పర్సనల్స్ లోతుల్లోకి వెళ్ళి మరీ వారి పరువు తీస్తున్నాడన్నవిమర్ష ఉంది. అంతే కాదు నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలు కూడా బయటకు మాట్లాడి.. ఫ్యాన్స్ లో స్టార్ల పరువు పోయేలా వ్యావహరిస్తున్నాడన్న విమర్ష ఉంది. ఇలాంటి వాటి వల్లే నాని కూడా ఈ షోకి పిలిచినా వెళ్ళను అని చెప్పాడని అంతా భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios