నాని నటిస్తున్న 'దసరా' చిత్ర సందడి మొదలయింది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

నాని నటిస్తున్న 'దసరా' చిత్ర సందడి మొదలయింది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'చమ్కీల అంగీలేసి' అనే సాంగ్ అయితే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. 

దసరా చిత్రం మార్చి 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నాని తన కెరీర్ లో తొలిసారి ఇలాంటి ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. దసరా చిత్రంపై నాని బోలెడు ఆశలే ఉన్నాయి. ప్రస్తుతం నాని దసరా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా నాని.. సుమ హోస్ట్ గ్గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షోకి తన చిత్ర యూనిట్ తో కలసి హాజరయ్యాడు. నానితో పాటు నటుడు దీక్షిత్ శెట్టి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ హాజరయ్యారు. 

సుమ ఈ షోలో నాని, దసరా టీం నుంచి ఫన్ రాబడుతూనే వారిని ఇరకాటంలో ప్రేట్టే ప్రశ్నలు కూడా అడిగింది. నాని చేత సుమ ఫన్నీ గేమ్స్ ఆడించింది. అనంతరం ప్రశ్నలు అడుగుతూ.. మీకు మీ భార్య కన్నా కొడుకంటేనే ఎక్కువ ఇష్టమా అని అడిగింది. దీనికి నాని మొదట అవును అని బోర్డు చూపించి వెంటనే అడ్డం తిప్పేశాడు. దీనితో షోలు అంతా నవ్వేశారు. 

టాలీవుడ్ లో నానికి కాంపిటీషన్ వచ్చే హీరోనే లేడా అని అడగగా.. నాని ఏమాత్రం ఆలోచించకుండా యస్ ని బోర్డు చూపించారు. దీనితో అంతా షాక్ అయ్యారు. దీనికి నాని వివరణ ఇస్తూ సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది సక్సెస్ కాలేదు అంటూ నాని ఏదో వివరణ ఇవ్వబోయాడు. చూస్తుంటే నాని నెపోటిజం గురించి మాట్లాడినట్లు అనిపిస్తోంది. అసలు నాని ఈ ప్రశ్నకు ఎలాంటి వివరణ ఇచ్చాడో పూర్తిగా తెలియాలంటే 25వ తేదీన సుమ అడ్డా షో చూసే తెలుసుకోవాలి.