Asianet News TeluguAsianet News Telugu

బలగం వేణుకి బంపర్ ఆఫర్, నేచురల్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్న జబర్థస్త్ కమెడియన్

బలగం దర్శకుడు వేణు బంపర్ ఆఫర్ కొట్టాడు. ఏకంగా నేచురల్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇంతకీ వీరి  కాంబోలో సినిమా ఎప్పుడు..? ఇందులో నిజం ఎంత..? 

Natural Star Nani Movie With Balagam Venu Director JMS
Author
First Published Dec 5, 2023, 7:43 AM IST

కొన్ని కొన్ని ఆఫర్లు ఆనుకోకుండా తలుపుతడుటుంటాయి. కొన్ని అనుకున్నా జీవితంలో సాధించలేనివారు ఉంటారు. తాజాగా బలగం దర్శకుడు వేణుకి అలాంటి ఆఫరే ఎదురెళ్ళింది. ఏకంగా నేచురల్ స్టార్ నానినిడైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు.. కొత్త దర్శకులు, హిట్ కాన్సెప్ట్.. ఇది నాని ఫార్ములా.. ఇప్పటికే ఇలాంటి ఫార్ములాతోనే  ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం హాయ్ నాన్నని తీసుకు వస్తున్నాడు నాని. ఈమూవీ కూడా నాని ఫార్ములలో భాగమే. 

ఇక తన ఫ్యూచర్ ఫిల్మ్స్ ను కూడా కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. తన సెలక్షన్ లో విలక్షణం ఉండేలాచూసుకుంటున్నాడు. దర్శకుల ఎంపికలో కూడా నాని తన కొత్త మార్క్ చూపిస్తున్నాడు. పస్తుతం  హాయ్ నాన్న ప్రమోషన్స్ ని  ఉత్సాహంతో చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా నాని ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా ఇంట్రాక్ట్ అయ్యారు. కొత్త విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు.

ఈక్రమంలోనే ఒక అభిమాని.. కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. బలగం వేణు అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల తన రెండో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాని ఈ కామెంట్స్ చేయడంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో  సినిమా పక్కాగా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు నాని. 

Nayanthara: స్టూడెంట్స్ కు బిర్యానీ వడ్డించిన నయనతార, సెలబ్రేషన్స్ లో లేడీ సూపర్ స్టార్

ఇక హాయ్ నాన్న సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక నాని తన 30వ సినిమాగా హాయ్ నాన్నను చేశారు. తన 31వ సినిమాగా సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు.  వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో అంటే సుందరానికి మూవీ వచ్చింది. సూపర్ హిట్ కాకపోయినా.. నాని అభిమానులను అలరించింది సినిమా. హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. అయితే ఆసారి మాత్రం వీరికాంబోలో మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios